ADUGADUGUNAA AGOWRAVAM- ANADARANA
Editor · New Arrivals

Price: Rs. 180. తెలుగు రాష్ట్రాల సంచార, విముక్త జాతుల ప్రజలు ఇప్పటికీ దుర్భర జీవితాలను అనుభవిస్తూ, రాజ్యాంగం ప్రకారం తమకు చెందవలసిన హక్కులు అమలు కాకపోయినా ఎంతో సహనంతో కొనసాగుతుండటాన్ని వివరిస్తూ రాసిన పుస్తకం ఇది. ఫీల్డ్ సర్వేలు చేసి, చారిత్రక సమాచారం సేకరించి ప్రొఫెసర్ తిరుమలి ఈ పుస్తకం రాశారు. ఈ జాతుల జనం వంశ పారంపర్య గాయకులుగా, సంగీతకారులుగా, మిమిక్రీ కళాకారులుగా జీవించారు. వారు బతుకుదెరువు కోసం గ్రామాలపై ఆధారపడే వారే, అయినా గ్రామంలో వారెప్పుడూ అంతర్భాగం కాలేదు. వలస పాలన ఆరంభంలో వారు తమ వృత్తులు కోల్పోయారు. ఆ కులాల్లో కొన్నింటిని "నేరగాళ్ల జాతులు”గా బ్రిటిష్ పాలకులు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం వారిని 'అలవాటు పడిన నేరగాళ్లు'గా ప్రకటిస్తూ చట్టం చేసింది. అంటే పుట్టుకతోనే వారిని నేరస్తులని ముద్ర వేశారన్న మాట. దానివల్ల భారత రాజ్యాంగంలోని 14 కింద ఎవరినీ అంటరానివారిగా, వివక్షతో చూడరాదన్న ఆదేశాన్ని ఉల్లంఘించి నట్లయింది. అధికరణ 14 కింద ఏ తెగనూ కులాన్నీ అగౌరవం, అమర్యాద, అసమానతలతో చూడరాదు. ఇతరులపై ఆధారపడి బతికే దశనుండి ఆ కులాలను ఎలా నేరస్త తెగలుగా మార్చారు? అక్కడినుండి వారిని ఎలా అలవాటు పడిన నేరగాళ్లుగా, బిచ్చగాళ్లుగా మార్చారు? వగైరా పరిణామ క్రమాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ఆ తెగలను తనలో కలుపుకోవడంలో మన ప్రజాస్వామ్యం విఫలమైంది. ఆ చేదునిజాన్ని ఈ పుస్తకం స్పష్టంగా వెల్లడిస్తుంది.