Adugaduguna Thirugubatu
Editor · Best Selling

Price: Rs. 450. ఈ పుస్తకాన్ని చదువుతుంటే.. ఆశ్చర్యం, అభిమానం, ఈర్ష్య వంటి భావావేశాలెన్నో పొంగుకొచ్చాయి.. నన్ను నేను మర్చిపోయాను! - నసీరుద్దీన్ షా, నటులు 'ఇప్పటి వరకూ ఓ భారతీయ మహిళ గురించి ఇలా చెప్పిన కథ మరేదీ లేదు' - కంచ ఐలయ్య షెఫర్డ్, సామాజిక శాస్త్రవేత్త 'నన్ను ముగ్ధుణ్ణి చేసిన రచన... ఎక్కడా మొహమాటాలకు తావులేకుండా, తపనతో, హృదయాలను కదిలించేలా రాశారు గీత' -జైరాం రమేష్, రాజకీయ నాయకులు 'గీతా రామస్వామి తన జీవితాన్నే ఉద్యమ రూపంగా మలచుకుని ప్రజల బాగు కోసం కృషి చేశారు' - జస్టిస్ ఎం.వి.రమణ, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ' మార్పు కోసం, దాన్ని సాధించే మార్గం కోసం నిరంతరం తపించిన ఓ ఆత్మ- కథ -బెజవాడ విల్సన్, యాక్టివిస్ట్ 'గీతా రామస్వామి తనకున్న సకల శక్తియుక్తులనూ కేవలం బడుగు వర్గాల ప్రయోజనాల కోసమే కాదు. సమాజంలో అత్యంత సహజంగా చెలామణి అయిపోతున్న దోపిడిని చీల్చిచెండాడేందుకు కూడా ఉపయోగించారు' - ఫ్రంట్ లైన్ ' ఎలిమినేడు గ్రామ చరిత్రను చెప్పాలంటే గీతా రామస్వామి అక్కడకు 'రాక ముందు-వచ్చిన తర్వాత అని చెప్పాల్సిందే'. - గట్టు విజయేందర్, విద్యార్థి 'మన దేశంలో వామపక్షాలతో ఉన్న తప్పేమిటి, న్యాయ వ్యవస్థను పట్టి పీడిస్తున్నవేమిటి, అలాగే ఈ దేశంలో పేదలకు న్యాయం ఎందుకు దక్కటం లేదు.. వంటి అంశాలపై ఇంతటి తీవ్ర విమర్శ, పదునైన పరామర్శ మనకు మరే పుస్తకంలోనూ కనిపించవు" - ది హిందూ 'సంగం మా జీవితాలను పూర్తిగా మార్చేసింది.. ఒకప్పుడు బూమి లేని కూలీనైన నేను.. స్థానిక ఎన్నికల్లో పోటీ కూడా చేసిన' - నాగటి బచ్చమ్మ, రైతు కూలీ కులం, కుటుంబం, భూస్వామ్యం.. ఇలా అణచివేతకు ఆలవాలమైన పలు వ్యవస్థలపై ఏకబిగిన సాగించిన ఎడతెగని పోరాట గాథ ఇది! -ద ఫెడరల్, డిజిటల్ పత్రిక ' చూపులో ఎంతటి స్పష్టత! తపన, దయార్ద్రత దండిగా ఉన్న; అన్నీ తరచి చూసి. వివేచనతో తన మార్గాన్ని ఎంచుకున్న ఓ పరిపూర్ణ జీవిత కథ ఇది' - ఇండియా టుడే 8 'మేం పోలీసులతోని కొట్లాడినం.. కోర్టు మెట్లెక్కినం.. జైళ్లకు పోయినం.. ఆఖరుకు 'మేం గెలిచినం' -దూనిమెట్ల సత్యమ్మ, ఇబ్రహీంపట్నం రైతు