Adhunika Mahabharatam
Editor · Novels

Price: Rs. 495. సాహిత్యం లలిత కళలు పరిపక్వ నాగరికతకు సంకేతాలు. సమాజానికి కరదీపికలు, కావ్యాలు, నాటకాలు అన్నీ ఒకే సృజన శక్తికి అనేక రూపాలు పార్శ్వాలు. ఆనాడు నాటకాలు రాసినది కవులు. నేడు సినిమాలకి కథలు రాస్తున్నదీ కవులే. కవులకు సినిమాలకు చిరకాల బాంధవ్యం ఉంది. ఈ రోజు సమాజంలో సాహిత్యం ఆదరణకు దూరమైంది. సాఫ్ట్వేర్, సిలికాన్ వ్యాలీ తప్ప మరేది రుచించడం లేదు నేటి తరానికి- ఇలాంటి బాధాకరమైన పరిస్థితులలో ఒక యువ కథానాయకుడు, ఒక మహాకావ్యాన్ని సామాన్య ప్రజానీకంలో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాధిపతి పవన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక కవి కవిత్వం వేదిక మీదనుంచి బిగ్గరగా వినిపిస్తున్నాడు. ఆ కవి మహాకవి శేషేంద్ర. ఆ మహా కాప్యం ఆధునిక మహాభారతం. తన వచన కవిత్వ సంకలనాలన్నింటినీ పర్వాలుగా మలిచి ఆధునిక మహాభారతం మహా కావ్యంగా తీర్చిదిద్ది ప్రచురించి రెండున్నర దశాబ్దాలు దాటింది. ఒక కాపీ కావాలని పవన్ కవి కుమారుడుకి కబురు చేశాడట. పుస్తకం ఇస్తాను కాని దీన్ని మళ్ళీ ప్రింట్ చేసే తాహతు లేదు. అచ్చు వేయించండి అని కవి కుమారుడు సాత్యకి మొరపెట్టుకున్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ ఉదారచిత్తంతో ఎంతో సంతోషంగా తన ఏకైక అభిమాన కవి శేషేంద్ర కావ్యాన్ని ముద్రించి వెలుగులోకి తెచ్చాడు.