Adhinayaka Jayahe / అధినాయక జయహే

చిన్నవ్యాసుడి / Chinnavyasudi · Novels

Adhinayaka Jayahe / అధినాయక జయహే book cover

Price: Rs. 108. మీ చేతుల్లో ఉన్న చినవ్యాసుడు రాసిన కవిత్వం అసాధారణం. ఈ సంపుటంలోని అరవై మూడు కవితలూ నేను చాలా ఆశ్చర్యంతో చదివాను. ఈ కవితలన్నిటిలోనూ నన్ను నివ్వెరపరిచిన విషయం. ఈ కవి హృదయంలో ఇంకా ఇంత పసితనం, ఇంకా ఇంత ఉద్వేగం, ఇంత తాజాగా ఎలా ఉన్నాయా అని. అదీ ఇన్నేళ్ళు పత్రికల్లో పనిచేసాక, ప్రపంచాన్ని ఇంత దగ్గరగా చూసాక, మనుషుల్లోని చీకటినీడల్ని ఇంత దగ్గరగా సహించాక - ఇంకా ఈయన ప్రపంచం పట్ల తనలోని ఈ శుభాకాంక్షని ఎలా కాపాడుకోగలిగాడని అడుగడుగునా ఆశ్చర్యపడుతూ చదివాను. లోకమిట్లానే నడుస్తుందిలే అని తనకు తాను సర్దిచెప్పుకునే వయస్సులో లోకమిలా ఎందుకుండాల అని అమాయికంగా ప్రశ్నించే ఈ పసితనంకన్నా గొప్ప భాగ్యం మరొకటి ఉంటుందనుకోను. చినవ్యాసుడిగారి జీవితప్రయాణం అసాధారణమైంది. అటువంటి సంఘర్షణ తరువాత మరొకరెవరేనా లోకాన్ని శాపనార్థాలతో ముంచెత్తుతారు. కాని ఆయన ఈ కవిత్వం ద్వారా శుభాశీస్సుల్తో ముంచెత్తుతున్నారు. ఇటువంటి వారు మసిలినందువల్ల మన ప్రపంచం మరింత శుభ్రపడుతుందని మనం నిస్సంకోచంగా నమ్మొచ్చు.

Browse more Telugu books