Adhi Andhra Udhyamam Bhagyareddy Varma Patra

Editor · Politics

Adhi Andhra Udhyamam Bhagyareddy Varma Patra book cover

Price: Rs. 90. మహాత్మావలే మరణం తరువాత డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్కు పూర్వరంగంలో దేశవాప్తంగా షెడ్యూల్డు కులాల సామాజిక రాజకీయ సంస్కృతిక జాతీయ ఉద్యమాన్ని నిర్వహించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. దీనికి ఈ కాలంలో షెడ్యూల్డు కులాల సామాజిక ఉన్నతి కోసం ఆ ఆయా రాష్టాలలో స్థానికంగా ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్, సత్యశోధక సమాజ్ వంటి సంస్థల్లో పనిచేస్తూ షెడ్యూల్డు కులాల హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. ఎస్సీల కోసం రిజర్వేషన్లు ఇచ్చిన సాహుమహారాజ్ ఈ కాలపు వ్యక్తి అదే విధంగా కేరళలో అయోతిదాస్, తమిళనాడులో అయ్యాంకాళి వంటి వ్యక్తులు ఎస్సీల ఉన్నతికోసం ఎంతాగానో పాటుపడ్డారు. ఈ వీరు క్రమంలోనే బౌద్ధమతాన్ని ఎస్సీలకు ఒక విముక్తి మార్గంగా ప్రచారం చేశారు. అప్పుడు మాత్రమే హిందూవర్ణ వ్యవస్థనుంచి ఎస్సీలు అనుభవించే వివక్ష, త నుంచి బైటపడగలరని వారి ఉద్దేశ్యం. సరిగ్గా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ నగరం కేంద్రంగా తన కార్యాచరణం ప్రారంభించి 1917 నాటికి దానిని ఆదిహిందూ ఉద్యమంగా మార్చి భాగ్యరెడ్డివర్మ జాతీయ నాయకుడిగా మారారు. ఈ క్రమంలో ఆయన మొత్తం దేశవ్యాప్తంగా పర్యటించారు. బెంగాల్ నుంచి మొదలుపెడితే మద్రాసు వరకు లక్నో నుంచి బెంగుళూరు వరకు అనేక సమావేశంలో పాల్గొని ఆనాటి ఎస్సీ సమాజం ఎదురుకుంటున్న అణచివేతల నుంచి, వివక్షల నుంచి బైటపడాలంటే హిందూ సమాజంలో మార్పులు రావాలని, లేనట్టయితే ఎస్సీ వర్గాలు హిందూ మతంలో కొనసాగరని ఉపన్యాసిస్తూ వారి హక్కుల కోసం నిరంతరాయంగా పని చేశారు. అదే రకంగా తెలంగాణ కంటే కూడా ఆయన ఆంధ్ర ప్రాంతంలోని అనేక పట్టణాలను పర్యటించి ఆయా సదస్సులు, సమావేశాలో పాల్గొని అక్కడి ఎస్సీ జన బాహుల్యాన్ని చైతన్యవంతం చేశారు. ఆయన నడిపిన ఈ ఉద్యమం వల్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయి. మద్రాసు రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ పర్యటన వల్ల అప్పటి వరకు పరయ్యలుగా పిలువబడే ఎస్సీలను అటు తరువాత నుంచి ఆదిద్రావిడులుగా పేరు మారుస్తూ ఆనాటి ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసింది. అదే రకంగా మాలలు, మాదిగల

Browse more Telugu books