Addamlo Gandhari

Editor · New Arrivals

Addamlo Gandhari book cover

Price: Rs. 75. ఇప్పుడు మీ ముందున్న "అద్దంలో గాంధారి, మరి పదకొండు కథలు" అనే కథల సంకలనం షడ్రసోపేతమైన విందు భోజనం వంటిది. ఇందులో ఒక్కో రసానికి, రుచికీ రెండేసి కథలు వడ్డించబడ్డాయి. కన్నడ, తమిళ, మలయాళాల్లోంచి ఆరు కథలూ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోంచి ఆరు కథలూ... వెరసి పన్నెండు కథల సమాహారం ఇది. అంటే దక్షిణాది నుండి ఆరూ, ఉత్తరాది నుండి ఆరూ... కలిసి డజన్ కథలయ్యాయి. వీటిని మొదటి ప్రచురణగా 1996లో "నయనం” తరఫున తీసుకొచ్చారు. ఆ సంవత్సరమే తెలుగు విశ్వవిద్యాలయం ఈ కథా సంకలనానికి "ఉత్తమానువాద" సాహిత్య పురస్కారం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ రెండవ ముద్రణ తీసుకొస్తున్నది

Browse more Telugu books