Adavi Muddulapalli Dammapeta Pranthala Bhuswamya Vyathireka Poratalu

Editor · Politics

Adavi Muddulapalli Dammapeta Pranthala Bhuswamya Vyathireka Poratalu book cover

Price: Rs. 95. అడవి మద్దులపల్లి, దమ్మపేట ప్రాంతాల భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కా. డి.వి. రూపొందించిన విప్లవ ప్రజాపంథాను ఆధారంగా చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కృషి చేస్తే, కొద్దికాలంలోనే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అభివృద్ధి చెంది, నిలదొక్కుకొని అవి ఏవిధంగా ముందుకు పురోగమిస్తాయో అనే విషయాన్ని మద్దులపల్లి, దమ్మపేట ప్రాంతాల ఉద్యమ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను అధికారంలో వున్న పాలక వర్గ పార్టీ నాయకులు ప్రజలను చీల్చి, విచ్చిన్నం చేసి దెబ్బతీయడానికి ప్రారంభం నుండి చేసే తమ ప్రయత్నాల్లో ఒక భాగంగా రెవిన్యూ, పోలీసు, యితర ప్రభుత్వ యంత్రాంగాలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో అనే దానికి దమ్మపేట ప్రాంతంలోని భూమి పోరాట అనుభవాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి. అదే విధంగా, ప్రజలు తమ సంఘటిత శక్తితో వారి అన్ని ప్రయత్నాలను కూడా ఎదుర్కొని, ఏ విధంగా ఉద్యమాన్ని కాపాడుకుంటూ దాన్ని ముందుకు తీసుకపోగలుగుతారో అనే దానికి కూడా ఆ పోరాటం ఒక మంచి నమూనాగా నిలుస్తున్నది. ఈ రెండు ప్రాంతాల్లోని ఉద్యమ అనుభవాల్లో గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం- గిరిజనులు, గిరిజనేతర పేదలతో కలసి ఉమ్మడిగా పోరాడటం వలసనే ఆ పోరాటాలు నిలదొక్కుకుని ముందుకు పురోగమించాయి. తగిన విధంగా విజయవంతం అయ్యాయి. వారిని విడదీయడానికి భూస్వాములు, పాలకవర్గ పార్టీల నాయకులు చేసిన అన్ని ప్రయత్నాలను సంఘ నాయకత్వంలో ప్రజలు తిప్పికొట్టి తుదకంటా తమ మధ్యన ఐక్యతను కాపాడుకున్నారు. ఈనాడు దేశంలో మతం పేరిట, కులాలు, కుల సంఘాల పేరిట పాలకవర్గ పార్టీలు, యితరులు ప్రజలను నిలువునా చీల్చడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో వాటన్నింటిని ఎదుర్కొని ప్రజలు ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకతను పై రెండు పోరాటాల అనుభవాలు నొక్కి చెప్పుతున్నాయి.

Browse more Telugu books