Abivruddi Pedarikam

Editor · Politics

Abivruddi Pedarikam book cover

Price: Rs. 45. ఇటీవల కాలంలో దేశంలో ఆర్థికాభివృద్ది బాగా వేగం పుంజుకుంది. ఈ అభివృద్ధి ఫలితాలు సమాజంలోని అన్ని తరగతుల ప్రజలకు సమానంగా అందటం లేదని విశ్వసించే వ్యక్తి మహేంద్రదేవ్. ఈ అభివృద్ధి ప్రక్రియలో అందరిని భాగస్వాములను చేయడం లేదని కూడ ఆయన చెబుతారు. అందరూ భాగస్వాములయ్యే సమ్మిళిత అభివృద్ధి కావాలన్నది ఆయన ఆకాంక్ష. అభివృద్ధి ఫలితాలు అందరికీ అందుబాటులోకి రావాలని కూడ ఆయన గట్టిగా వాదిస్తారు. గత నాలుగేళ్లకాలంలో ఆయన రాసిన వ్యాసాలు ఈ వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ప్రొ|| ఎస్ .మహేంద్రదేవ్ ప్రస్తుతం హైదరాబాదు లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డిని, యేల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టరల్ అధ్యయననాన్ని చేశారు. ముంబాయిలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చిలో పదకొండు సంవత్సరాల పాటు అధ్యాపక వర్గంలో సభ్యునిగా ఉన్నారు. వ్యవసాయాభివృద్ధి, పేదరికం, ఆహార భద్రత, ఉపాధి హామీ, సామాజిక భద్రత, ఉపాధి తదితర సమస్యలపై నిశితమైన అధ్యయనం జరిపి విస్తారంగా రచనలు చేశారు. ప్రభుత్వం నియమించిన పలు కమిటీలలో ఆయన సభ్యునిగా పనిచేశారు.

Browse more Telugu books