Abhishapam
Editor · Novels

Price: Rs. 135. అభిశాపం "మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్ళిపోవటమే న్యాయం" అన్నాడు ప్రశాంత్. గాయత్రి రెచ్చిపోయినట్టుగా అంది - "ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ, చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు! ఇలా నడి సముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూ తీరిపోతాయి.". "గాయత్రీ!” ప్రశాంత్ గాయత్రిని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. "ఆ మాట ఇంకెప్పుడూ అనకు!" గాయత్రి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడ్చేసింది. "ఈ సమస్యకు ఇంకే పరిష్కారమూ లేదంటే అదే మార్గం! ఎప్పటికైనా చచ్చిపోవలసిన వాళ్ళమే! ఆనంద్కి మనం ఈ మాట చెప్పలేనట్టయితే మృత్యువునే వెతుక్కుందాం. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం!” మౌనంగా వున్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి సవలారాజం - అభిశాపం