Abhiruchi

Editor · New Arrivals

Abhiruchi book cover

Price: Rs. 180. సాహిత్యం ఆమెకు తీరని దాహం, అక్షరాన్ని కొంగుచాపి ఒడిసి పట్టుకుని నడుమున దోపుకునే లాలిత్యం ఆమెది. కవిత్వం, కథ, నవల, సమీక్ష, విమర్శ అది ఏ ప్రక్రియ ఐనా ఆమెకు సాహిత్యం పైనే అభిరుచి. సాహిత్య పటిమతో పుట్టింటి పెండ్యాల వారి కన్నా మెట్టింటి కొండపల్లి వంశానికి ఎక్కువ గౌరవం అందించిన ఘనత ఆమెది. ఆమె కొండపల్లి నీహారిణి. వైవిధ్యమైన వస్తువులతో కూడిన గ్రంథాల సమీక్ష, విమర్శల వ్యాసాలతో తన అభిరుచిని వ్యక్తపరిచి సాహిత్యానుభవాన్ని పాఠకులకు అందిస్తున్నారు. కవుల దృక్పథాలు మొదలు స్త్రీవాద సాహిత్య సమీక్ష వరకు కొనసాగిన ఈ వ్యాసాలలో సామాజిక వస్తు వైవిధ్యాల ప్రస్తావన వుంది. తాత్విక, చైతన్య స్పృహలపై పరామర్శ వుంది. సమీక్ష, విమర్శ వ్యాసాలు నీహారిణి గారి భావనలు, ఆ భావనలతో పాటు సాహిత్య ప్రక్రియలలో పరిణామం, వికాసాన్ని అర్థం చేసుకునే అవకాశం కలిగిస్తాయి. సాహిత్య విమర్శతో కూడిన వ్యాసాలలో వ్యాసకర్త తన సాహిత్యాలోచన ఫలితాలను వ్యక్తం చేస్తారు. కవుల, రచయితల సంవేదనలను, ఆలోచనాపరిధులను విమర్శకుడు తన అధ్యయనంతో విస్తృతపరిచి, విశాలం చేసి సృజన రంగానికి అందజేస్తారు. ఆ పని చేసి రచయిత్రి ఇక్కడ తన సాహిత్య భావనల లోతులపై వున్న అవగాహనను ప్రకటిస్తుంది. నీహారిణి గారు ఎంపిక చేసుకొని వ్యక్తపరచిన రచనలలోని సారం ఆమె 'అభిరుచి'ని ప్రతిఫలించే అభివ్యక్తి.

Browse more Telugu books