Aatmakathallo Aanaati Telangana
Dr. Gummannagari Balashri Nivasamurthy / డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి · Biographies & Auto Biographies

Price: Rs. 145. డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 1966 సెప్టెంబర్ 5న జన్మించారు. స్వస్థలం మెదక్ జిల్లా పోతారెడ్డిపాలెం. తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని స్వర్గీయ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ, తల్లి స్వర్గీయ పద్మావతి. ప్రసిద్ధ సాహితీవేత్తలు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిల మార్గదర్శకత్వంలో రచనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఇప్పటికి ఎనిమిది పుస్తకాలు అచ్చయ్యాయి. అనేక పత్రికల్లో గ్రంథ సమీక్షలు వెలువడ్డాయి. పలు సంచికల్లో వ్యాసాలు, పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయి. రమారమి యాభై జాతీయ సదస్సులు, కొన్ని అంతర్జాతీయ సదస్సుల్లోనూ పత్రసమర్పణ చేశారు. ఈ తరానికి చెందిన ఉత్తమ వక్తల్లో ఒకరుగా గుర్తింపును పొందారు. ప్రస్తుత రచనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. 2007 నుండి డిచ్పిల్లి లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమర్శనా రంగం పట్ల అభిమానం, పరిశోధన అంటే ప్రాణం. ఆనాటి తెలంగాణాలో నెలకొన్న వాతావరణాన్ని, ఇక్కడి జీవన వేదనలను, జనవాణి వినిపించిన నాదాలను, సాంస్కృతిక పరిస్థితులను, సామాజిక స్థితిగతులను, అక్షర సంపదలను, చదువుల సంగతులను, పత్రికల వెలుగులను, చైతన్య సంచలనాలను ఈ పుస్తకం విపులంగా ఆవిష్కరిస్తోంది. ఆత్మకథల ఆధారంగా నిర్మించిన ఈ గ్రంథం సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారి అభివర్ణనలో 'తెలంగాన విజ్ఞాన సర్వస్వం.