Aangleya palakulu antaranivallu
Editor · History

Price: Rs. 45. డా॥ బి. ఆర్. అంబేడ్కర్ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటిష్ పాలనలో, 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ళ సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్ళు అమలుచేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది. ఆధునిక విద్య, ఉపాధి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్ సూటిగా ప్రశ్నిస్తారు. అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటిష్ పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్ళూనుకునేట్టు చేసిన బ్రిటిష్ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు. అనువాదకులు యాజ్ఞి అలంపూరు (మహబూబ్నగర్)కు చెందినవారు. ఆయనకు 'అధికారం- విస్మృతి' ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.