Aakasamlo Sagam
ఓల్లా / Volga · Novels

Price: Rs. 117. జసింత ఎందుకు చచ్చిపోయింది? ఏం కాని పని చేసింది? మనందరం చెయ్యని పని చెయ్యలేదే? మనందరం ఒద్దంటే తనొక్కతే చెయ్యలేదే - ఆడవాళ్ళందరూ కలిసి వూళ్ళో దొడ్లు కావాలను కున్నారు. కట్టుకున్నారు. ఈ చిన్న పని ఊరిలో ఆడాళ్ళు సుఖపడే మంచిపని మగాళ్ళు సహించలేక పోయారు. తమ ఆడాళ్ళు సుఖపడుతుంటే చూడలేక పోయారు. అసలు వాళ్ళ కోపం ఈ దొడ్లు కట్టుకున్నామని కాదు - వాళ్ళని ధిక్కరించామని వాళ్ళను లెక్కచెయ్యలేదని - ఆ ధిక్కారాన్ని మగవాళ్ళు సహించలేకపోయారు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని మీరు ఎదిరించటానికి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఐతే ఇవాళ మనం చెయ్యాల్సిన పోరాటం ఇంకొకటుంది. జసింతను చంపినవాళ్ళను మనం ఒదిలి పెట్టగూడదు. జసింత దిక్కులేనిది కాదు. మనం ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నాం. జసింతకు అక్కలం, చెల్లెళ్ళం, పెద్దమ్మలం, పిన్నమ్మలం ఉన్నాం. మనం జసింతను ఎవరో మదమెక్కిన మనుషులు వచ్చి వాళ్ళిష్టం వచ్చినట్లు చంపితే మనం చూస్తూ వూరుకోం. అడ్డుతగిలి తీరుతాం. వాళ్ళకు శిక్షలు పడేలా చేస్తాం.. ఆడవాళ్ళమీద అఘాయిత్యాలు చెయ్యటమంటే, ఆదవాళ్ళ ప్రాణాలు తియ్యటమంటే వాళ్ళనుకున్నంత తేలికకాదని తెలియచెప్పుదాం.