Aakaasam Kolpoyina Pakshi

Editor · Literature

Aakaasam Kolpoyina Pakshi book cover

Price: Rs. 112. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారం వారం దేశ రాజకీయాలకు అద్దం పట్టే రచయిత ఎ. కృష్ణారావు గురించి తెలియని పాఠకులు తక్కువ. అలాగే మూడు దశాబ్దాలుగా అడపా దడపా కవిత్వం రాసే కృష్ణుడి గురించీ కవి మిత్రులకు తెలసు ఎన్.ఆర్ చందూర మోటూరి హనుమంతరావు, తాపీధర్మారావు, ఆలూరి బైరాగి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలను అందుతున్న కృష్ణారావు దేశ సామాజిక, రాజకీయ పరిణామాలపై ఇండియాగేట్, నడుస్తున్న హీనచరిత్ర పేర్లతో పుస్తకాలు రచించారు. ఉన్నట్లుండి. ఇంకెవరు శీర్షికలతో కవితాసంపుటాలు వెలువరించారు. తెలుగు జర్నలిజం. సాహితీ రంగాల్లో తనదైన శైలిలో రచనలు చేసే కృష్ణుడు (ఎ. కృష్ణారావు) కలం లోంచి వెలువడిన కవితల వెల్లువే ఈ 'ఆకాశం కోల్పోయిన పక్షి.' 'ఈ కవి- తెగిపడుతున్న పక్షుల రెక్కల చప్పుడు వినగలడు. కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనుల్ని పసిగట్టగలడు. సంక్షోభ సమయంలో ఆధునిక కవిగా, వార్తాపత్రిక రచయితగా రెండురంగాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నవారిగా తప్పకుండా పేర్కొనవలసిన వారు- కృష్ణుడు. కంటికి రెప్పలు లేని వాడే నేటి కవి. ఆధునిక కవి. ఆకాశాన్నీ, పక్షినీ కోల్పోతున్న వైనాన్ని నిశితంగా గమనిస్తూ రానున్న ప్రమాదంపై హెచ్చరిస్తున్న కవి, పహరా కవ్ని దార్శనిక కవి కృష్ణుడు... ఇది ఉద్యమాల స్థాయి గల సంపుటి'.

Browse more Telugu books