AADHUNIKA TELUGU KVITVAMLOO MAANAVATAAVAADAM VIBHINNADHOORANULU
Editor · Literature

Price: Rs. 190. డా॥ అరుణకుమారి ప్రాచీన భారతీయ వాఙ్మయాలలో ఉన్న మానవతావాదాన్ని ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ వివరించారు. ఇది ప్రాచీన వాఙ్మయంతోనూ, తత్త్వ శాస్త్రాదులతోనూ రచయిత్రికి ఉన్న మంచి పరిచయానికీ, అవగాహనకీ నిదర్శనం, ఏదైనా కథావస్తువునుగాని, సన్నివేశాన్నిగాని ఆధారంగా చేసుకొని, అంతర ప్రవాహ రూపంలో, పంచదార పాకంలాగ, ఈ వాదాలలోని సిద్ధాంతాల్ని నిజమైన కవితా సౌరభంతో అందిస్తే అవి పఠితల మనస్సులో స్థిరమైన చోటు చేసుకుంటాయి. తెలుగు కవిత్వంలో మానవతావాదానికి సంబంధించిన వివిధాంశాలను సుస్పష్టంగా, సోదాహరణంగా విశదీకరించడంతోపాటు, ఈవాదం పుట్టు పూర్వోత్తరాలనూ, మన ప్రాచీన వాఙ్మయంలోను, తత్త్వశాస్త్రంలోను ఉన్న దీని స్వరూపాన్నీ వివరిస్తూ డాక్టర్ (శ్రీమతి) అరుణకుమారి రచించిన ఈ పరిశోధనాత్మక గ్రంథం ఈ విషయానికి సంబంధించినంతవరకు సర్వాంగ పరిపూర్ణంగా ఉంది.