AA NALUGURU LEENI... CORONA KATHALU

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ / Naagabelli Jithender Samrat · Stories & Poetry

AA NALUGURU LEENI... CORONA KATHALU book cover

Price: Rs. 135. మానవాళి జీవనయానంలో ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంటే. అందులో కోవిడ్ -19, కరోనా ఒకటి. మిగిలిన మహమ్మారిల కంటే కోవిడ్-19 ప్రపంచాన్ని గడగడలాడించింది. భూగోళమంతా లాక్ డౌన్ చేసుకొని, నిత్య కార్యకలాపాలని ఆపివేసింది. ప్రపంచమంతా లాక్ డౌన్ చేసుకొని, నిత్య కార్యకలాపాలని ఆపివేసింది. ప్రపంచమంతా స్తంభించిపోయి భీతావాహ పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ కాలం నడిపింది తెల్లవారి సూర్యోదయం చూసే నమ్మకమే ఎవరికీ లేదు. ఒక కొత్త వ్యక్తి ఊరిలోకి వచ్చినా, వీధుల్లోకి వచ్చినా, ఇంటిముందుకు వచ్చినా మానవబాంబు ఎదురైనంతగా భీతిల్లిపోయారంతా. బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, పరిచయాలు అంతా మిధ్యగా మారిపోయాయి. నా వాళ్ళు అనే భావనపోయి, నేను బతికితే చాలు అనే భావన ప్రపంచ మానవాళి ఆలోచనల్లో గింగిర్లు తిరిగింది. తొలి దఫా వచ్చిన కరోనా ప్రపంచంలో ఎక్కడెక్కడో చనిపోయారని విన్నాం, రెండో దఫా వచ్చిన కరోనా వలన మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన గ్రామంలో మనింటి పక్కన, మనింట్లో వ్యక్తే ప్రాణాలు కోల్పోయిన వార్తలు మనల్ని భయకంపితులను చేసింది. గొప్పా, పేద అనే భేద భావం లేకుండా కరోనా అందరిని సమంగా చేసింది.

Browse more Telugu books