A. Annapurna Sahityam

Editor · Literature

A. Annapurna Sahityam book cover

Price: Rs. 280. సోషల్ లీడర్ పాత్రను అన్నపూర్ణగారు ప్రతిభావంతంగా పోషించారు. అందుకోసం తనకొచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. తనకున్న స్పందించే శక్తిని సమాజానికి కూడా సాధ్యమైనంత విస్తరించే క్రమంలో ఆమె రచయితగా మారారు. యధాతథస్థితిని కొనసాగనీయకుండా, అదే సమయంలో విప్లవాత్మక మార్పు పేరుతో ఉన్న మంచిని ధ్వంసం చేయకుండా, సర్దుబాటు ధోరణితో సామాజిక వ్యవస్థల, కట్టుబాట్లలోని సమస్యలకు సామరస్య పరిష్కారం చూపేందుకు ఆమె ప్రయత్నించారు. సమాజానికి, ప్రకృతికి మధ్య సంఘర్షణను సనాతనవాదుల్లా తోసిపుచ్చకుండా ఆ దిశగా ప్రతి కొత్తదనాన్నీ ఆమోదిస్తూ ఆరోగ్యకరమైనరీతిలో పరిష్కారాలు వెతికారు.

Browse more Telugu books