70 Stories of O.Henry
పి. రాజేశ్వరరావు / P. Rajeshwara Rao · Books

Price: Rs. 315. మీకు మంచి సాహిత్యం చదివే అలవాటు ఉందా? లేకపోయినా చదవాలనే కోరిక ఉంటే మాత్రం ఓ హెన్రీ కథలు చదవండి. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత. అమెరికాలోని నార్త్ కరోలినాలో గ్రీన్స్బోర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఓ హెన్రీ అనేది ఆయన కలం పేరు. అసలు పేరు 'విలియం సిడ్నీపోర్టర్'. పాతికేళ్ళప్పుడు 1887లో పదిహేడేళ్ల 'ఏథోల్ రోచ్'ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు ఒక పాప (మార్గరెట్), ఒక బాబు పుట్టారు. 1894లో 'ది రోలింగ్ స్టోన్' అనే హాస్య పత్రికను నడిపాడు. కొంతకాలం 'హెూస్టన్పోస్ట్'లో రిపోర్టర్గా, కాలమిస్టుగా, కార్టూనిస్టుగా పనిచేశాడు. మరికొంతకాలం మందుల దుకాణంలో గుమస్తాగా పనిచేశాడు. ఎప్పుడూ తన చుట్టూ ఉండే మనుషుల జీవితాలను పరిశీలిస్తూ వుండేవాడు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ తన కథలోకి పాత్రల్ని వెతుక్కునేవాడు. ఒకపక్క కథలు రాస్తూనే బ్యాంకులో ఉద్యోగం చేశాడు. మనుషుల్లోని నిజాయితీని ప్రేమిస్తూ ఎందరినో తన రచనలతో ప్రభావితం చేసిన ఓ హెన్రీ తన 48వ ఏటనే మరణించాడు. కథని అద్భుతమైన కొన మెరుపుతో ముగించడంలో ఓ హెన్రీని మించిన రచయిత మరొకరు లేరు, లేదు, లేరు.