7 Vaaraala Neethi Kathalu
పి. రాజేశ్వర రావు / P. Rajeshwar Rao · Children's Books

Price: Rs. 95. వెనకబడితే వెనకేనోయ్! 'మొద్దబ్బాయ్' అనిపించుకోవాల్సి వస్తుంది. ప్రపంచమంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విజేతలు పరిశ్రమిస్తారు అని సూక్తి. గొప్పవాళ్లు కావాలని కోరుకునే పిల్లలకు కూడా ఈ మాటే వర్తిస్తుంది. రోజూ ఓ గంటో, గంటన్నరో చదువులకు కేటాయించండి. అలా అని, కొత్త తరగతి పాఠాలు ముందే బట్టీపట్టమని కాదు. గణితంలో కొత్త సూత్రాలు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్లో కొత్తపదాలు తెలుసుకోవచ్చు. వ్యాకరణ నియమాలు అర్ధం చేసుకోవచ్చు. దినపత్రికలు చదివి జనరల్ నాలెడ్జి పెంచుకోవచ్చు. మంచి పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకోవచ్చు. ఎదిగేకొద్దీ, పై తరగతులకు వెళ్లేకొద్దీ ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. అనగనగా ఓ గురువుగారు శిష్యుడి చేతిలో జాతిరత్నాన్ని పెట్టి, 'దీని విలువ ఎంత వుంటుందో బయట ఎవరినైనా కనుక్కునిరా!' అని పురమాయించాడు. శిష్యుడు దారినపోయే దానయ్యని అడిగివచ్చి, 'యాభైవేలు ఉంటుందన్నారు. గురూజీ!' అని సమాధానమిచ్చాడు. 'పక్కవీధిలోని స్వర్ణకారుడిని అడుగు. ఏమంటాడో?' అని ఆదేశించారు. 'లక్ష రూపాయలు ఉంటుందన్నాడు స్వామి!". గంట తర్వాత తిరిగొచ్చి చెప్పాడు. శిష్యుడు.