450 Neethi Padyalu

పి. రాజేశ్వరరావు / P. Rajeshwara Rao · Literature

450 Neethi Padyalu book cover

Price: Rs. 75. నేటి బాలబాలికలే రేపటి భావిపౌరులు. పిల్లలను బాల్యంనుండే నీతిమంతులుగాను, బాధ్యత ఎరిగిన వారిగాను శిక్షణ యిచ్చినప్పుడే భావితరం కృతకృత్యం కాగలదు. ఈ విషయాలపై యోగీశ్వరులు, మహానుభావులు, కవులు, సామాజిక విషయాలలో అనుభవ పరిజ్ఞానంగలవారు ఎన్నో గ్రంథాలను, శతకాలను రాశారు. ఆ శతకాలలోని పద్యాలు నేటి పిల్లలకు ఎంతో అవసరమైనప్పటికీ, వాటికి పాఠ్యగ్రంథాలలో తగినంత అవకాశం లేదు. పిల్లలకు నీతులు తెలుపుటలో, వారికి తగిన క్రమశిక్షణ, సాంఘిక మర్యాదలు, మన ఆచార, వ్యవహారాలు తెలుపుటలో నీతి పద్యాలు ముఖ్యమైనవి. అందులో విదుర, సుమతి, వేమన, భాస్కర, కవి చౌడప్ప, గువ్వలచెన్న మొదలగు శతకాలు ప్రముఖపాత్ర నిర్వహిస్తాయి.

Browse more Telugu books