4000-Suprasiddha Sooktulu & Samehtalu

P. Rajeswara Rao / పి. రాజేశ్వరరావు · Books

4000-Suprasiddha Sooktulu & Samehtalu book cover

Price: Rs. 144. సూక్తులు మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు అనుభవాల గుళికలు. అనుభవానికి పుట్టిన శిశువే సూక్తి సూక్తులు మానసిక ప్రశాంతతకు శాంతిదూతలు. మన సమస్యలకు చిట్కాలు. మన వ్యక్తిత్వ వికాసానికి సూత్రాలు, విజయానికి మెట్లు.TH కొండంత విషయాన్ని గోరంత మాటల్లో చెప్పేవే సామెతలు. చేదు మందును పంచదారతో పొదిగి మింగించే హితోక్తులే సామెతలు. మాటకారితనానికి మొనగాళ్ళు సామెతలు. ఇందులో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో 4000 లకు పైగా సుప్రసిద్ధమైన, ఆణిముత్యాల్లాంటి సూక్తులు, సామెతలు, జీవిత సత్యాలు వున్నాయి. ఎక్కువగా జర్మన్, ల్యాటిన్, ఇటాలియన్, గ్రీకు, ఫ్రెంచ్, ఆంగ్లం నుంచి వున్నాయి. పాఠకుల సౌలభ్యం కొరకు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించడంలో తెలుగు భాషలో వున్న మాధుర్యాన్ని, సొగసును కాపాడాలని కొన్నిచోట్ల భావానికి ప్రాధాన్యత ఇస్తూ, అక్కడక్కడ సమాన తెలుగు సూక్తి లేదా సామెతను ఇచ్చాం. దీనివల్ల పాఠకులు సూక్తిని, సామెతను త్వరగా అర్ధం చేసుకుని ఎక్కువ కాలం గుర్తుంచుకునేందుకు సులువవుతుంది. ఈ పుస్తకం ఇంగ్లీషు, తెలుగు సూక్తులు, సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా మాట్లాడాలనుకునే ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, మేనేజర్లకు, లీడర్లకు చక్కగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. ఈ పుస్తకాన్ని ఆంగ్ల, తెలుగు పాఠకులు తగు విధంగా ఉపయోగ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలో ఏమైనా లోటుపాట్లు వుంటే విజ్ఞతగల పాఠకులు నా దృష్టికి తెస్తే కృతజ్ఞతలతో స్వీకరిస్తాను.

Browse more Telugu books