40 Purana Neethi Gaadhalu
Sripada Subrahmanya Sastri / శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి · Stories & Poetry

Price: Rs. 135. తెలుగు వచనానికి కండబలం, గుండెబలం యిచ్చిన రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు గణనీయులు. ఆధునిక తెలుగుకథకు గురజాడ జీవం పోస్తే తరువాత తరంలోని శ్రీపాదవారు దానికి జవం కలిగించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు జగము ఎరిగినవాడు; జగము తన్నెరిగినవాడు. వారు రాసిన 75 సామాజిక కథల్లో తెలుగు కుటుంబాల ఆపేక్ష... అంతఃకరణలు ఎలాంటివో ఆ మరియాదలు, మన్ననలు ఎట్టివో అర్థమవుతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచ్చటౌతుంది. వచన రచనకు పెట్టింది పేరు వారి వాక్యం. ఇవే మా తెలుగు కథలంటూ తెలుగువాళ్ళు గర్వించదగిన కథల నందించిన ఘనాపాఠీ మన శ్రీపాదగారు. వీరు రామాయణం, భారతం (4 పర్వాలు), మహాభక్త విజయం, దేవవాణీ సుభాషితాలు, చాణక్య నీతిసూత్రాలు, పురాణగాథలు- మొదలగు గ్రంథాలు రాశారు. నాకు పురాణగాథలు ద్వితీయ సంపుటి 2013లో లభించగా 'పురాణ నీతి గాథలు' పేరుతో ప్రచురించాను. ఇప్పుడు మానస పౌండేషన్స్ శ్రీ రాయుడుగారు పురాణగాథలు మొదటి సంపుటి జిరాక్స్ పంపారు. వారికి నా ధన్యవాదాలు. ప్రారంభించిన పని పూర్తి చేయాలనే శ్రద్ధతో అందులోని 38 గాథలకు మరి 2 గాథలు చేర్చి మొత్తం 40 గాథలతో అక్కడక్కడ బొమ్మలతో ‘40 పురాణ నీతిగాథలు' పేరుతో ఈ పుస్తకం మీకు అందిస్తున్నాను. ఇందులో శ్రీపాదవారి రచనలను పాఠకులకు అందించాలనే తపన తప్ప లాభాపేక్ష ఎంతమాత్రమూ లేదు. శ్రీపాదవారి రచనల ఆదరణలో పాఠకులలో గణనీయమైన మార్పు వచ్చింది. ఎక్కువగా ఇంటర్నెట్, ఈబుక్స్ వైపు పాఠకులు చూస్తున్నారు. అయినా తెలుగు భాషపట్ల, శ్రీపాదగారిపట్ల నాకున్న అభిమానాన్ని కొనసాగించాలనే ఈ పుస్తకాన్ని ప్రచురించాను. ఇందులోని 40 కథలు భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాల్లోని నీతికథలు. పురాణాలన్నింటినీ పూర్తిగా చదవాలనే కోరిక, తీరిక, ఓపిక నేటి పిల్లలకుగాని, పెద్దలకుగాని లేదు. దానికి కారణాలు అనేకం. అలాంటివారికి ఈ కథలు - నీతి, విజ్ఞానం, వికా వినోదంతోపాటు వివేకాన్ని కలిగిస్తాయి. ఈ పుస్తకం చిన్నదే కనుక త్వరగా చదివేయవచ్చు. కనుక పిల్లలూ, పెద్దలూ ఈ కథల్ని చదివితే మంచిది. ఈ పుస్తకాన్ని మీకందిస్తున్న ప్రతిభ పబ్ల