21 Shathabdaniki Margadharshakudu Lenin

Editor · Politics

21 Shathabdaniki Margadharshakudu Lenin book cover

Price: Rs. 35. లెనిన్ తన 54 ఏండ్ల జీవిత కాలంలో (1870-1924) ఎన్నో ఎగుడుదిగుళ్ళు చూసాడు. విప్లవోద్యమం ఊపుగా ఉన్న కాలాన్నీ, తిరోగమనాన్నీ కూడా చూసాడు. అంతిమంగా విజయం సాధించాడు. మార్క్సిజమనే అనే శాస్త్రాన్ని నిర్దిష్టంగా అధ్యయనం చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాన్ని రచిస్తూ, వ్యూహానికి తగిన ఎత్తుగడలను రూపొందిస్తూ వచ్చాడు. మార్క్సిజం ఒక శాస్త్రం. ఇది నిరంతరం ప్రవహించే సజీవనది లాంటిది. ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. ప్రవాహమూ ఉంటుంది. కానీ నీళ్ళు మారుతుంటాయి. ప్రవాహ వేగం మారుతుంటుంది. దాని కనుగుణంగా అది దిశలు మార్చుకుంటుంది. మార్క్సిజం గాల్లోనుంచి ఊడిపడలేదు. ఏ దేవుడూ సృష్టించలేదు. 19వ శతాబ్దం ఆఖరు వరకూ ప్రపంచ గమనాన్ని అనేక కోణాల నుంచి అధ్యయనం చేసిన మార్క్స్, ఎంగెల్సులు తమ సిద్ధాంతానికి పదును పెట్టారు. దానికే "వాస్తవాల ఆధారంగా సత్యాన్ని గ్రహంచడం" అని అన్నారు. దీన్ని లెనిన్ మరొక అడుగు ముందుకు తీసుకుపోయి 20వ శతాబ్దపు ఆరంభ దినాల్లో వ్యక్తం అయిన నూతన మార్పులకు అనుగుణంగా మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి చేశాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో గుత్తాధిపత్యం పెరిగి యుద్ధాలకు దారితీసే సామ్రాజ్యవాదపు దశను లెనిన్ ఆవిష్కరించాడు. అందుకే స్టాలిన్ "20వ శతాబ్దపు మార్క్సిజమే లెనినిజం" అని అన్నాడు.

Browse more Telugu books