20వ శతాబ్దం సంక్షిప్త రాజకీయ చరిత్ర /20VA SATABDHAM SANKSHIPTA RAJAKEEYA CHARITRA

గుడిపూడి విజయరావు · History

20వ శతాబ్దం సంక్షిప్త రాజకీయ చరిత్ర /20VA SATABDHAM SANKSHIPTA RAJAKEEYA CHARITRA book cover

Price: Rs. 85. ఇరవయ్యవ శతాబ్దం ముగిసిపోయి ఇరవైఐదేళ్ళు కావస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం అని సందేహం రావచ్చు. మానవ జాతి చరిత్రలోనే ఈ శతాబ్దం లాంటి సంచలన శతాబ్దం మరొకటి లేదు. ఇది ప్రపంచ గతిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన శతాబ్దం. యుద్ధాలు, విప్లవాలు, జాతీయ విమోచనోద్యమాలు, ప్రతీఘాత విప్లవాలు, ఫాసిస్టు ఉద్యమాలు, పెట్టుబడిదారీ పునరుద్ధరణలు, సంక్షోభాలు-అంతేకాదు, ముందుకు దారి చూపేవి కూడ ఈ శతాబ్దపు అనుభవాలే. అలాంటి అద్భుత శతాబ్దం ఇది. అందుచేతనే ఈ పుస్తకం. నిజానికి ఇరవయ్యవ శతాబ్దం ముగుస్తున్న సమయంలోనే ప్రొఫెసర్. ఐజాజ్ అహ్మద్ దీన్ని రచించారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్ర శ్రేణి మార్క్సిస్టు రచయిత. రాజకీయ పరిణామాలను ముందుచూపుతో అధ్యయనం చేయడంలో అందెవేసిన చేయి.

Browse more Telugu books