1984
పి. మోహన్ / P. MOHAN · Novels

Price: Rs. 225. జార్జ్ ఆర్వెల్ నవలిక 'ఏనిమల్ ఫామ్' తెలుగు పాఠకులకు పరిచయమే. అందులో ఎంత వ్యంగ్యం ఉందో '1984'లో అంత ఆవేదన ఉంది. అంతకు మించిన విమర్శ, ముందుచూపు, హెచ్చరిక ఉన్నాయి. 1984 కేవలం నవల మాత్రమే కాదు, గుండె లోతుల్లోంచి వెల్లువెత్తిన ఆక్రోశం కూడా. ఇది యుగయుగాలుగా పాలకుల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న మానవ ముఖం చేస్తున్న ఆర్తనాదం. మనమిప్పుడు జీవిస్తున్నది ఆర్వెల్ కన్నీటి. నెత్తుటి బొట్లతో చిత్రించిన నియంతృత్వాల భౌగోళిక పటంలోనే. సారమే కాదు కెమెరాల నిఘా, బాకాల, యుద్ధాల రూపమూ మారని అదే అసమానతల, అబద్ధాల, చిత్రహింసల, అజ్ఞాన ప్రపంచం. దీన్ని ఏలుతున్న దుష్టశక్తి ప్రాణమున్న చిలుక ఎక్కడుందో ఆర్వెల్ స్పష్టంగా మ్యాపు గీసి చూపించాడు.