1901 Nundi Sahithyamlo Nobel Mahilalu
Mukunda Rama Rao / ముకుంద రామారావు · Biographies & Auto Biographies

Price: Rs. 65. ముకుందరామారావు గారు సృజనాత్మక రంగానికి సంబంధించి విభిన్న ప్రక్రియల్లో కృషి చేస్తున్నారు. ప్రధానంగా కవిత్వం రాస్తున్నప్పటికీ వచన రచనలు, అనువాదాలూ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడు స్వీయ కవిత్వ సంకలనాలతో పాటు 'అదే ఆకాశం' (అనేక దేశాల అనువాద కవిత్వం), 'శతాబ్దాల సూఫీ కవిత్వం', '1901 నుండి నోబెల్ కవిత్వం' (కవుల కవిత్వ జీవిత విశేషాలు), 'అదే గాలి' (ప్రపంచదేశాల కవిత్వం నేపధ్యం) అనువాద గ్రంథాలు, 'దేశదేశాల కప్పల కథలు', 'నిన్ను నువ్వు చూసుకునే అద్దం' (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) కథా సంపుటాలు వెలువరించారు. రైల్వే రిజర్వేషన్స్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ని రూపొందించడంలో ముఖ్య భూమిక నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైల్వే స్టేషన్లలోని టెర్మినల్ లో ఏర్పాటు చేసిన POET - Passenger Operated Enquiry Terminals కి రూపకల్పన చేశారు. 1901 నుండీ ఇప్పటివరకూ సాహిత్యానికి నోబెల్ బహుమతులు పొందిన 14 మంది మహిళల జీవిత విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.