11th HOUR
Editor · New Arrivals

Price: Rs. 270. లెవంత్ అవర్ సినిమా ప్రపంచానికి అందిన ఆఖరి అస్త్రం. ఈ అస్త్రం విధ్వంసకారి కాదు! ఉపయోగపడే వరం! ఈ లెవెంత్ అవర్ నిర్ణయాల మూలంగా 90 శాతం ప్రయోజనాలుంటాయి. హడావుడిగా చేస్తే పది శాతం నష్టాలు కూడా వస్తాయి. సినిమా రషెస్ చూసుకునేటప్పుడు ఈ క్రింది విషయాలు గమనించాలి. 1. కథాంశానికి - అంటే ఏ కథ అనుకున్నామో ఆ కథ తాలూకూ ప్లాట్ డెవలప్మెంట్ సక్రమంగా జరుగుతోందా? 2. హీరో ఆశయం నెరవేరుతోందా? 3. హీరో ఆశయం మారిందా? మారితే ఆ మార్పుకి అనుగుణంగా ప్రేక్షకుణ్ణి ప్రిపేర్ చేసారా? 4. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి మనసులో ఏవన్నా ప్రశ్నలు వస్తున్నాయా? వస్తే చాలా ప్రమాదం! ఇన్వాల్మెంట్ రావలసిన సమయంలో అనుమానాలు వస్తుంటే అనుభూతి ఐక్యత దెబ్బతినిపోతుంది. 5. ఎడిటింగ్ చేసేటప్పుడు అవసరమైన దృశ్యాలు వదులుకుని అనవసరమైన వాటిని ఉంచుకున్నామా? ఇలా అనేక విషయాల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని సరి చేసుకుంటే వరం లేకపోతే శాపం.