హైదరాబాద్ నుండి తెలంగాణ దాక / hyderabad nundi telangana daka
లక్ష్మణరావు పతంగే / Lakshman Rao Patange · Politics

Price: Rs. 180. శ్రీ లక్ష్మణరావు పతంగే తెలుగు భాషా సాహిత్య బోధనలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం గడించారు. హైస్కూలుతో మొదలైన వీరి సాహిత్యజీవితం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరకు కొనసాగింది. లక్ష్మణావుగారి మాతృభాష మరాఠీ, హైదరాబాదు నగరంలో విద్యాభ్యాసం వల్ల ముస్లిమ్ అధ్యాపకుల సాహచర్యం వల్ల ఉర్దూ భాషలో ప్రవేశం సంపాదించారు. వీరికి హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రవేశముంది. జానపద గేయాలను సేకరించి 'తెలంగాణా జనపదాలు'గా ప్రచురించారు. చేతివృత్తులవారిపై 'తీగ తెగిన వీణ నా తెలంగాణ' అన్న సంపుటిని ప్రకటించారు. 'తెలంగాణ కేకలు' అన్న పేరుతో తెలంగాణ ఉద్యమ కవితల్ని సంకలించారు. 'ఉర్దూ తెలుగు నిఘంటువు'ను కూర్చారు. ఇది చాల ప్రఖ్యాతమైనది. తెలుగు-ఉర్దూ నిఘంటువు'ను కూర్చారు. 'హిందీ-ఉర్దూ జాతీయాలు సామెతల నిఘంటువు'ను కూర్చారు. 'తెలంగాణలో ఉర్దూ బాస' అనే నిఘంటువును కూర్చారు. 'యుగనాయిక' అనే నవలను, 'కర్మ సిద్ధాంతం' అనే పుస్తకాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. 'దాస్తానే హాతింతాయి' అనే అరబ్బు వీరుడి కథను 'అరబ్బు వీరుడు హాతిం' అనే పేరుతో తెనిగించారు. 'హైదరాబాద్్క అదీబ్' అనే ఉర్దూ పుస్తకాన్ని తెలుగులో 'హైదరాబాదు ఉర్దూ సాహిత్యవేత్తలు' పేర అనువదించారు. తెలంగాణ కోలాట పితామహుడు చేవెళ్ళు దాసు పేరున అతని రచనలను సంకలించారు. ఇంకా పత్రికల్లో వ్యాసాలు కవితలు రాశారు. వీరి సాహిత్య కృషిని గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం తేది 2-06-2017 రోజున తెలంగాణా రాష్ట్ర మూడవ ఆవిర్భావ దినోత్సవంనాడు వీరిని 'హైదరాబాదు మహానగర ఉత్తమ సాహితీవేత్త' అవార్డు నిచ్చి ఘనంగా సత్కరించింది. పల్లెటూళ్లు, వాటి చుట్టూ వున్న పొలాలు, తోటలు, వాగులు, వంకలు తో మొదలుపెట్టి హైదరాబాదు నగరపు వీధులు, ఇరానీ హోటళ్లు, సినిమా థియేటర్లు వరకు సమకాలిక చరిత్రకు గతకాలపు చరిత్రను జోడిస్తూ తనతోపాటు మనల్ని సంచారం చేయిస్తారు లక్ష్మణరావు గారు ఈ 'హైదరాబాద్ నుండి తెలంగాణ దాక' లో.