హేతువాదం సమాజం మరియు వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుందా? / Hethuvadam Will rationalism contribute to personal and social development?
J.V. Krishnaiah / జె.వి. కృష్ణయ్య · Books

Price: Rs. 180. హేతువాదం వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందా?" అనే ప్రశ్నతో శ్రీ జె.వి. క్రిష్ణయ్యగారు పాఠకుల ముందుకు వచ్చారు. శ్రీ క్రిష్ణయ్యగారు సహజంగానే ఉపాధ్యాయులు కావడంతో ప్రశ్న సంధించడం, సమాధానం రాబట్టడం, సమాధానం సరైనది కాకపోతే సరిదిద్దడం, ఆపైన ఆ సమాధానం ఎందుకు సరికాదో, తాను చెప్పింది ఎలా సబబో వివరించడం ఈ పుస్తకం మొత్తం కనబడుతుంది. హేతువాదం అంటేనే ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, అపైన సత్యాన్ని రాబట్టడం, దానిని అనుసరించడం. అంతేగాని ఆస్తికత్వంలోలాగా గుడ్డిగా నమ్మడం, అనుసరిచడం కాదు. అసలు దేవుడే అబద్ధం. ఆ అబద్దం మీద, ఊహ మీద అనేక సిద్ధాంతాలు, నీతులు, నియమాలు ఏర్పడ్డాయి. అందుకనే సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయి. ఇంత దుర్మార్గం ఉంది. ఇంత దోపిడీ ఉంది. ఎవరైనా సరే ఆలోచిస్తే ఆస్తికుడుగా ఉండలేరు. ఈ అసమానతలు సహించలేరు. కర్మ, దురదృష్టం, నుదుటిరాత, అదృష్టం, దురదృష్టం, స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, యజ్ఞాలు, యాగాలు, పూజలు, నైవేద్యాలు, మోక్షం, ముక్తి, పూర్వజన్మ, పునర్జన్మ-ఇవన్నీ ఒట్టి థ్రాష్ అని కొట్టి పారేస్తారు..