హితసూచని / Hitha Suchani

సి. వేదవతి / C. Vedavathi · History

హితసూచని / Hitha Suchani book cover

Price: Rs. 112. సంఘ సంస్కరణోద్యమ భావాలను బెంగాలీల నుంచి తెలుగువాళ్ళు స్వీకరించారనటానికి ముందే ఈ తెలుగు గడ్డపై సంఘ సంస్కర్తలు పుట్టారు. అందుకు హితసూచని సజీవ సాక్ష్యం. - గిడుగు మామిడి వెంకయ్య, సామినీన ముద్దు నరసింహం నాయడు అటువంటి తెలుగు బిడ్డలు. గురజాడ, గిడుగు, వీరేశలింగంలాంటి సంస్కర్తలు చెప్పిన ప్రధాన అంశాలన్నిటినీ ఒకతరం ముందే నాయుడుగారు తన హితసూచనిలో పొదిగారు. సుమారు 160 ఏళ్ల కిందట రాసిన గ్రంథమిది. భావ స్పష్టతలోగాని, లక్ష్యశుద్ధిలోగాని హితసూచనిలో ఎక్కడా మీకు లోటు కన్పించదు. చేతబడులూ, నరబలులూ, స్త్రీ వివక్షా సజావుగా సాగిపోతున్న మన ఈ సమాజానికి హితసూచని ఇప్పటికీ ఆధునికమే. భావ వికాసాన్ని పట్టించుకోకుండా భాషా విన్యాసాలనే ఇప్పటికీ జ్ఞానంగా, పాండిత్యంగా స్వీకరిస్తున్న పెద్దలకు హితసూచని ఇప్పటికీ మేలుకొలుపే. హితసూచని ఇప్పుడు సరళమైన ఆధునిక తెలుగు భాషలో మీ చేతుల్లో....

Browse more Telugu books