హిందువులు / The Hindus
వెండీ డోనిగర్ / Wendy Doniger · History

Price: Rs. 247. ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. “ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ" 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. తర్వాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు. పుట్టుకతోనో, ఆచరణరీత్యానో హిందూమతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది. ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్నకులాలు, నిరక్షరాస్యుల వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణరీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది. ఇది వెలువడటానికి ముందు, ఇటువంటి రచన అసలు అసాధ్యమనిపించేది... ఇది గొప్ప రచన. -బిబేక్ దేబ్రాయ్ హిందూ గ్రంథాలు, సంప్రదాయాలు ఎంత సంపద్వంతమైనవో, వాటి లోతు, వైవిధ్యత ఎంతటివో అంతర్జాతీయ పాఠకులకు తెలియజెప్పాలంటే వెండీ డోనిగర్ వంటి అపారమైన విద్వత్తు, అధ్యయనం, అంతర్ దృష్టి, సొగసైన శైలి గలవారు మినహా మరెవరూ ఆ పని చేయలేరు. ఇదొక శ్రేష్టమైన రచన. దీని గురించి కొన్ని సంవత్సరాలపాటు చర్చ జరుగుతుంది. - సుధీర్ కక్కడ్ ఇది మహాసక్తికరమైన చరిత్ర రచన... ప్రాచీన భారతదేశపు కథాకథన సంస్కృతి యావత్ ప్రపంచంలోనే ఎందువల్ల సాటిలేనిదో వివరిస్తుందీ పుస్తకం. - గురుచరణ్ దాస్ ప్రాచీన కాలపు శాసనాలు, తారీఖులు- దస్తావేజుల మీదుగా సాగిన సాదాసీదా యాత్రలాంటిది కాదీ పుస్తకం. అంతకు మించి ఇది గత మూడు వేల సంవత్సరాల కాల వ్యాప్తంగా విస్తరించి ఉన్న తన అభిమాన పాత్రమైన ప్రదేశాలు, మహత్తరమైన పరిణామాలు, తను ప్రేమించిన గ్రంథాల మీదుగా నడిచిన మానసిక తీర్థయాత్ర వంటిది. -డేవిడ్ షుల్మన్ ఈ రచనలో గొప్ప విద్వత్తు ఉంది. విభిన్నాంశా