స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా... / "Did independent India leave a handful of dust for women..."

Dr. B. Vijayabharati / డా|| బి. విజయభారతి · Literature

స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా... / "Did independent India leave a handful of dust for women..." book cover

Price: Rs. 180. ఈమె కళాప్రపూర్ణ పద్మభూషణ్ బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతుల ప్రథమ సంతానం. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో హైస్కూల్ విద్యనూ, కాకినాడ పిఠాపురం మహారాజా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనూ, హైదరాబాదు కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ విద్యనూ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1961 లో తెలుగులో యం.ఏ. పట్టా పొందారు. డా॥ బి. విజయ భారతి విభాగంలో ఆరునెలలు పనిచేశారు. హైదరాబాదు రోజరీ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాద కాన్వెంట్లో ఉపాధ్యాయినిగానూ ఉన్నారు. 1965-78 నిజామాబాదు మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా వైస్ ప్రిన్సిపాలుగా పనిచేశారు. 1978 నుండి హైదరాబాదులోని తెలుగు అకాడమిలో రిసర్చి ఆఫీసరుగా డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందించారు. 1999 నవంబరులో ఇన్ఛార్జీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. డిప్యూటీ డైరెక్టరు (పబ్లికేషన్స్)గా ఉన్న సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పాఠ్యపుస్తకాలను ఇంగ్లీష్ మాధ్యమంలో రాయించే ప్రయత్నానికి అంకురార్పణ జరిగింది. అకాడమి ప్రచురించిన తెలుగు సాహిత్యకోశం ప్రాచీన యుగం, ఆధునిక యుగం (1851-1950) సంపుటాలకు సంపాదకత్వం వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన అంబేడ్కర్ రచనలు ప్రసంగాలు తెలుగు అనువాద సంపుటాలు 1, 4, 10, 14లకు సహసంపాదకులుగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమి తెలుగు సలహా సంఘ సభ్యులుగా 2008 - 2012 ఉన్నారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2014 లో వీరిని సత్కరించింది. నాగార్జున విశ్వవిద్యాలయం వారు విశిష్ట మహిళా పురస్కారం ఇచ్చి గౌరవించారు (2020). ఈమె పౌరహక్కుల ఉద్యమాలలో నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర వహించిన బొజ్జా తారకం (1939-2016) గారి సతీమణి.

Browse more Telugu books