స్పూర్తి సామాజిక అంశాలపై వ్యాస సంకలనం / Inspiration: Essay Collection on Social Issues
Editor · Politics

Price: Rs. 95. "భారతీయత ఎంతో విశిష్టమైనది. మతాలకతీతం. భారతీయ ప్రజల సాంస్కృతిక జీవధార! భారతదేశంలో నేడున్న మతాలు రాకమునుపే భారతీయత విలసిల్లింది. సమానత్వం జీవన విధానం. నాడు కులాలు లేవు, వృత్తులు ఉండేవి. స్త్రీ-పురుష సమానత్వం కలిగి ఉంది. వ్యభిచారానికి ఆస్కారమే లేదు. విజ్ఞాన సముపార్జన విద్యపై వివక్ష లేదు. విజ్ఞానం ఆసరాగా ముందుకు సాగింది. ఎక్కువ తక్కువలు అసలు లేవు. శ్రమించటం గౌరవంగా భావించారు. సమిష్టి నిర్ణయానికి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ప్రకృతి ఆరాధన కలిగి ఉన్నారు. అవసరం మేరకే వినియోగించుకునే సంస్కృతి కలిగి ఉన్నది. సమస్త జీవ కోటితో సహవాసంతో పర్యావరణ అనుకూల పద్దతి కొనసాగింది. దానిపై పరాయిలు ఆధిపత్య భావజాలంతో నిచ్చెన మెట్ల సంస్కృతిని వివక్షత పద్ధతిని నడిపించారు. దానిపై భారతీయత భావజాలంతో అనేకమంది పోరాడారు. వారిని ఆదర్శంగా నేటి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధిని ఆకళింపుకొని, భారతీయతను నిలబెట్టుకోవాలి. "