స్త్రీ / Stree

chalam / చలం · Books

స్త్రీ / Stree book cover

Price: Rs. 202. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువ రించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. "చలానికి ప్రశంసలను, అభిశంసలను మిక్కిలిగా తెచ్చిన గ్రంథం యిది. బందరులో ఉండగా జరిగిన ఒక గోష్ఠిలో Man and the Woman వాస్యం ఇంగ్లీషులో వ్రాసి చదివారు. దాన్నే తరువాత విస్తరించి “స్త్రీ” పేరున తెలుగు రచన చేసారు. స్త్రీ పురుష సమస్య గురించి చలంగారి అభిప్రాయం స్పష్టంగా తెలియాలంటే ఈ సిద్దాంత రచనను చదివి తీరాలి. ఈ పుస్తకానికి మళ్లీ మళ్లీ వ్రాసిన వారి ముందుమాటలను చదవటంగూడ అవసరం. స్త్రీ స్వాతంత్య్ర విషయంలో తాను ఆశించినదేమిటో శంకలకు తావు లేకుండా చెప్పారు. ఈనాటికీ అంగీకరించటానికి ఎవరైనా వెనుకాడేంత పురోగామిగా చలం ఆనాడే వ్రాశారు. అందుకే చలం ముందుతరాల రచయిత.

Browse more Telugu books