సోక్రటీస్ / SOCRATEES

నిడమర్తి ఉమారాజేశ్వరరావు / Nidamarthi Uma Rajeswara Roa · History

సోక్రటీస్ / SOCRATEES book cover

Price: Rs. 95. తత్త్వశాస్త్రంలో మూడు విభాగాలు ఉన్నాయి: ప్రాచీన తత్త్వశాస్త్రం క్రీ.పూ. 600 నుంచి సుమారు క్రీ.శ. 400 దాకా. మధ్యయుగ తత్త్వశాస్త్రం క్రీ.శ. 400 నుంచి 1600 దాకా. ఆధునిక తత్త్వశాస్త్రం క్రీ.శ. 1600 నుంచి నేటిదాకా. ప్రాచీన తత్త్వశాస్త్రం పూర్తిగా గ్రీకు తత్త్వశాస్త్రమే అని చెప్పవచ్చు. క్రీ.పూ.400కీ, క్రీ.పూ.300కీ మధ్య వున్న సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ప్రాచీన తత్త్వశాస్త్రజ్ఞుల్లో అత్యంత ప్రముఖులు. వారి తత్త్వశాస్త్రం తదుపరి పాశ్చాత్య సంస్కృతినంతటినీ ప్రభావితం చేసింది. అధిభౌతిక శాస్త్రం (Meta physics), విజ్ఞానశాస్త్రం, తర్కశాస్త్రం, నీతి నియమాలకి సంబంధించి మనకి వున్న భావాలన్నింటికీ మూలం వారి ఆలోచనల్లో వుంది. ప్రాచీన గ్రీసులో పలు విశిష్ఠ తాత్త్విక సంప్రదాయాలు కూడా పరిఢవిల్లాయి. తొలి గ్రీకు తత్త్వశాస్త్రజ్ఞులను సోక్రటీస్ పూర్వ తత్త్వ శాస్త్రజ్ఞులు అంటారు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు సోక్రటీస్ జన్మించిన సుమారు క్రీ.పూ. 469కి పూర్వులు. ప్రకృతి, విశ్వం, వాస్తవిక ప్రపంచ స్వభావం యీ మూడు అంశాల పట్ల సోక్రటీస్ పూర్వ తత్త్వ శాస్త్రజ్ఞులు ప్రధానంగా ఆసక్తి ప్రదర్శించారు. ప్రకృతిలో కనిపించే వాటన్నింటికి మూలంలో వున్న పదార్థమేమిటో గుర్తించాలనీ దానిద్వారా సమస్త ప్రాకృతిక అంశాలనూ వివరించాలనీ వాళ్ళు ప్రయత్నించారు. దేవుళ్ళు లేక ప్రకృతికి అతీత శక్తులే ప్రాకృతిక ఘటనలన్నింటికీ కర్తలని సోక్రటీస్ పూర్వ తత్త్వ శాస్త్రజ్ఞులు విశ్వసించలేదు. ప్రాకృతిక విషయాలకు సహజ సిద్ధమైన వివరణ యిచ్చేందుకు వాళ్ళు ప్రయత్నించారు. విశ్వం అనేది పరస్పరం సంబంధం కలిగిన సమీకృత విషయాల సమాహారమనీ, వాటిని ఆలోచనద్వారా వివరించగలమనీ వాళ్ళు భావించారు. మౌలికమైన తాత్త్విక ప్రశ్నలకి వాళ్ళు భిన్న భిన్నమైన, పరస్పర విరుద్ధమైన సమాధానాలు యిచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఆ సమాధానాల కంటే, ఆ సమస్యలను వాళ్ళు పరిశీలించగలిగారన్నది విశేష ప్రాముఖ్యం కలిగిన అంశం. తాము ఆధారపడగలిగిన పూర్వ తాత్త్విక ప్రాతిపదిక యేదీ వాళ్ళకి లేకపోయినప్పటికీ, వాళ్ళ భావాలు తదుపరి తత్త

Browse more Telugu books