సేవాసదనం / SEVASADANAM
కె . వి .రెడ్డి / K .V. REDDY · Novels

Price: Rs. 135. ఆధునిక హిందీ సాహిత్య ధృవతార ప్రేమచంద్ రచన ఈ సేవాసదన్. ఈ నవలా నాయకి సుమన్. రూపవతైన భార్యను కొంగుకు కట్టుకున్న నిప్పుగా తలచే భర్త ఆమెను ఇంటినుండి గెంటేస్తాడు. ఏ ఆసరా ఆశ్రయంలేని సుమన్ ఏ దారీలేక అందాల అంగడికి రాణి అవుతుంది. సుమన్ తనను తాను సరిదిద్దుకోవడం కోసం సంపదనూ విలాసవంతమైన జీవితాన్నీ తృణప్రాయంగా త్యజిస్తుంది. అవమానాలు, తిరస్కారాలు, నిరాదరణ, నిరాశ్రయమూ ఏవీ ఆమె సంకల్పాన్ని బలహీన పరచలేవు. పాశ్చాత్తాప దగ్ధుడైన భర్తే గజాధర స్వామియై ఆమెకు మార్గదర్శి అవుతాడు. ఆమె సేవాధర్మాన్ని జీవన మార్గంగా స్వీకరిస్తుంది. వేశ్యల పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి కృషిచేస్తుంది. తిరస్కారాలు, అవమానాలు ఎదుర్కున్నచోటనే గౌరవాన్ని, ఆదరణను సంపాదించుకుంటుంది. సేవాసదనానికి వెలుగవుతుంది. ప్రేమచంద్ మానవీయ దృక్పథానికి సేవాసదన్ ఓ మచ్చుతునక.