సాఫ్ట్ వేర్ నానీలు / SOFTWARE NAANEELU
Kudikala Vamsidhar / కుడికాల వంశీధర్ · Novels

Price: Rs. 108. సుమారు అరశతాబం కిందట పఠాభి తన "ఫిడేల్ రాగాల డజన్”లో కొత్త ప్రతీకల వాడకంలోని వైచిత్రీ ప్రియత్వానికి ముచ్చటపడ్డా, వ్యంగ్య ధోరణికి ఆనందించాం. ఇక్కడ వంశీ కంప్యూటర్ ప్రతీకలతో జీవనమూల్యాల అవలోధనానికి చాలావరకు విజయం సాధించాడు. పూనుకొని నెగెటివ్ పాజిటివ్ అంశాల మధ్య దోబూచులాట ఈ నానీలో కనిపిస్తుంది. అయితే వంశీ ఓటు జీవితానికే. దాని లోతుల్లో దాగిన సుందర భౌమిక చలనాలకే. వరమాన కాలంలో ఒకానొక సమతూకం సాధించడానికి పడిన తపన ఈ నానీల్లో కనిపిస్తుంది. అయితే వంశీ ఓటు జీవితానికే. దాని లోతుల్లో దాగిన సుందర భౌమిక చలనాలకే. - డాక్టర్ ఎన్. గోపి కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వంశీ కవిత్వాన్ని తన హాట్స్పాట్గా మార్చుకున్నాడు. తన చుట్టూ ఈ నానీల కవిత్వాన్ని అల్లుకున్నాడు. తన స్పందనల్ని కవిత్వంలోకి కోడింగ్ చేసుకునే నైపుణ్యాన్ని సాధించాడు. ఎన్నో అనుభూతుల చిప్స్ ను పొదువుకుని అందరికీ షేర్ చేస్తున్నాడు. ఈ నానీల్లో ఎర్రర్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. విమర్శకుల టెస్టింగ్ ను ఎక్కడా దొరకడు." తన ఆలోచన నానీల యాప్లో బంధించాడు. దీనికి మార్కెట్లో మంచి రేటింగ్ వస్తుందన్న విశ్వాసంతో వున్నాను. ఈ కవితా సంపుటిలో వంశీధర్ పాస్వర్ నాకు దొరికింది. కవిత్వం అతని చిరునామా. నానీలు కవి సంతకం. - డాక్టర్ ఎస్. రఘు కవి, విమర్శకుడు