సహచరులు / SAHACHARULU
varavararao / వరవరరావు · New Arrivals

Price: Rs. 95. ఆంధ్రప్రదేశ్ లో 'ఆట, పాట, మాట బంద్' అనే దారుణ నిర్బంధకాండ సాగిన 1985-89 కాలంలో, సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసులలో నిందితుడిగా వెయ్యి ఒంటరి రాత్రుల నిర్బంధం అనుభవించిన వరవరరావు రచన ఈ 'సహచరులు'. ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ భీమా కోరేగాం హింసాకాండ కేసు, సుర్జాగడ్ హింసాకాండ కేసు అనే అబద్ధపు కేసులలో నిందితుడిగా ఆయన అనుభవిస్తున్న జైలు నిర్బంధం గతంలో అమలయిన అన్ని అక్రమ నిర్బంధాల వంటిదే. గతంలో నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయన జైలు నుంచి రాసిన కవితామయ లేఖల సంపుటం 'సహచరులు' ఈ సందర్భంలో మళ్లీ ప్రచురించడం ప్రస్తుత సందర్భానికి, ఆయన నిర్బంధానికి వ్యతిరేకంగా సంఘీభావం సమీకరించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తక పునఃప్రచురణ.