సంస్కరణా, విప్లవమా? / Reform or Revolution?
Gandhi / గాంధీ · Biographies & Auto Biographies

Price: Rs. 70. విప్లవోద్యమంలో తలెత్తిన రివిజనిజానికి ఈ చిరు పుస్తకం తొలి సిద్ధాంత సమాధానం. విప్లవోద్యమం సాఫీగా, సూటిగా ఏ ఆటంకాలూ లేకుండా, సైద్ధాంతికంగా ఎటువంటి అవలక్షణాలకూ లోనుకాకుండా ముందుకు సాగిపోతుందని ఊహించుకోవడం ప్రమాదకరమైన భ్రమ. జాతీయ, అంతర్జాతీయ విప్లవోద్యమాల్లో నిరంతరాయంగా పెడ ధోరణులు పుడుతూనే ఉంటాయి. అది రివిజనిజం కావచ్చు; పిడివాదం కావచ్చు; బ్యురోక్రాటిక్ ధోరణులు కావచ్చు; వ్యక్తి పూజ కావచ్చు. ఎప్పటికప్పుడు ఆ ధోరణులను పసికట్టి, వాటిని వదిలించుకోలేకుంటే, ఉద్యమం నాశనమైపోతుంది. విప్లవశక్తులు ఉద్యమాన్ని కాపాడుకోవాలంటే, ఉద్యమంలో అంతర్గత ప్రజాస్వామ్యం ప్రాణావసరం. ఓ పెడ ధోరణికి వ్యతిరేకంగా జరిగిన సిద్ధాంత పోరాటానికి ఈ పుస్తకం ఒక మంచి నమూనా. రోసా లక్సెంబర్గ్ విప్లవానికీ, స్వేచ్ఛకీ, ప్రజాస్వామ్యానికీ, చిత్తశుద్ధికీ, మేధోపాటవానికీ ఏక కాలంలో ఓ అద్భుతమైన ప్రతీక. ఆమెకివే మా జోహార్లు.