షేక్స్ పియర్ కథలు / Shakespeare Stories

ముక్తవరం పార్థసారథి / Mukthavaram Parthasaradhi. · Books

షేక్స్ పియర్ కథలు / Shakespeare Stories book cover

Price: Rs. 135. కథా లోకంలో షేక్స్ పియర్ ఒక ధృవతార. ఒక జీనియస్. అన్ని ప్రక్రియలూ ఆయనవే. హాస్యం, విషాదం, చరిత్ర, సాహస గాథలు, ప్రేమ కథలు, జానపదాలు - అన్నీ. షేక్స్ పియర్ నాటకాలు రాశాడు. అవన్నీ పద్య రూపకాలు. మంత్రగత్తెనైనా, చంటిపిల్లనైనా, మృత్యువుతో పోరాడిన వీరాధివీరులైనా, యువప్రేమికులైనా, వాగుడుకాయనైనా వ్యక్తుల వివిధ రూపాలను సజీవంగా పట్టుకున్నాడు. శతాబ్దాలు గడిచినా ఆ నాటకాలు నేటికీ నిత్య నూతనాలు. షేక్స్ పియర్ జీవితకాలంలోనే అతడి నాటకాలకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆరు నాటకాలు ప్రచురితమైనాయి కూడాను. ఆయన మరణం తర్వాత ఏడేళ్లకు, 1623లో ఇద్దరు మిత్రులు జాన్ హెమ్మింగ్స్, హెన్రీ కాండెల్ నాటకాలన్నింటినీ పుస్తకంగా ప్రచురించారు. అదే “ఫస్ట్ ఫోలియో.” ఇందులోని 14 కామెడీలు, 12 ట్రాజెడీల కథలివి. ఇప్పుడు ఆ 26 నాటకాలను క్లుప్తంగా వచనంలోనే చదవండి.

Browse more Telugu books