శూద్రకవి / SHUDRAKAVI

Editor · Stories & Poetry

శూద్రకవి / SHUDRAKAVI book cover

Price: Rs. 95. తెలుగు సాహిత్యంలో పల్లె మనిషి వేదనను, బహుజన తత్వాన్ని, మానవీయ బంధాలను ఆత్మీయంగా కవిత్వీకరించిన బెల్లి యాదయ్య కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యానికి మానవీయ కోణాన్ని చూపింది. ఆయన కవిత్వంలో ఉన్న సాహిత్య సిద్ధాంతాల మేళవింపు వ్యక్తిగత అనుభవం నుంచి సామాజిక అన్వయానికి, తాత్విక చింతన నుంచి నిర్మాణ సమతుల్యత వరకు విస్తరించినట్లు కనిపిస్తుంది. 'శూద్రకవి' బెల్లి యాదయ్య కవిత్వాన్ని అన్ని కోణాలలో ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలోని వ్యాసాలన్ని ఈ తరం యువకుల ఆలోచనలనుండి యాదయ్యను అంచనా వేశాయి. వారు కొత్త సిద్ధాంతాలను అప్లై చేసిన విధానం, అనుభవపూర్వకంగా లీనమై రాసిన తీరు కనిపిస్తుంది. కవి భావజాలం. కవి సామాజికం, కవి ప్రాంతం. కవిని దగ్గరినుండి చూసిన వారు కావడం వల్ల కవిని స్వంతం చేసుకున్న విధానం, తన్మయత్వం పొందిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది.

Browse more Telugu books