శర్వమ్మ మరణం / SHARWAMMA MARANAM

Vasarachettla Jayanthi / వాసరచెట్ల జయంతి · Books

శర్వమ్మ మరణం / SHARWAMMA MARANAM book cover

Price: Rs. 207. వాసరచెట్ల జయంతి రాసిన కథల్లో కవితాత్మకమైన స్పర్శ స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతమైన వర్ణన చదివించే శైలి రెండింటిని సమాన స్థాయిలో రాయడం మూలాన రచయిత్రి కథల్లో దృశ్యాత్మకత సహజంగా ఆవిర్భవిస్తుంది. తీసుకున్న కథా వస్తువు, కథను నడిపిన తీరు, ఎంచుకున్న పాత్రల నిర్మాణం ఆమెలో ఒక మంచి కథకురాలు ఉన్నట్లు తెలియజేస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా విశ్లేషిస్తుందనే ఒక నమ్మకాన్ని ఇచ్చే కథాసంపుటి ఇది. - పెద్దింటి అశోక్ కుమార్ మంచి కథాంశాల్ని స్వీకరించి అవసరమైన చోట్ల పాత్రకు అనుగుణమైన ప్రాంతీయభాషతో కూడిన సంభాషణలతో మంచి పఠనీయతతో కథల్ని రాస్తోంది జయంతి. చాలా కథల్లో సాధికారత కలిగిన స్త్రీ పాత్రలు కూడా వుండటం రచయిత్రి యొక్క అభ్యుదయభావాలు, దృక్కోణం వ్యక్తం అవుతున్నాయి. కాలక్రమేణా మారుతున్న సమాజంలోని మార్పులతో పాటు ప్రజల జీవనవిధానాల్నీ, మనిషి మనస్తత్వంలో పెరుగుతున్న స్వార్థం, అహంకారాలను జయంతి రాసిన కథల్లో సహజంగా ప్రతిబింబిస్తాయి. - శీలా సుభద్రా దేవి

Browse more Telugu books