వెలుతురు సాహిత్య వ్యాసాలు /VELUTURU (Sahitya Vyasalu)

డా॥ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు / Dr. Rentala Sri Venkateswara Rao · Literature

వెలుతురు సాహిత్య వ్యాసాలు /VELUTURU (Sahitya Vyasalu) book cover

Price: Rs. 198. *విమర్శ ఎందుకు? ఎవరికోసం? * కృష్ణశాస్త్రిగారు బోలెడు విమర్శ కూడా రాశారు. చదువరులు దాన్ని విమర్శగా గుర్తించలేదెందుకు? * తిరుమల రామచంద్రగారిని కేవలం సాహిత్య విమర్శకుడనడం ఎంచేత తప్పు? ఆ వ్యాసాల్లో ఆయన తవ్విపోసిన విశేషాలేమిటి? * తెలుగు గజల్ ఇలా ఎందుకుంది? అసలిది గజలేనా? * కందుకూరి సాహిత్య వ్యాసంగాన్ని 'ఔపయోగికత' ఏ రకమైన మార్పుకు గురిచేసింది? * దాశరథి పద్యశక్తి మనకు పూర్తిగా అవగతం అయిందా? ఇప్పుడు అచ్చువేస్తున్న పద్ధతిలో ఆయన పద్యాల్ని అచ్చువేస్తే ఎందుకు తప్పు? * తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' రాయకుండా పద్యాలే రాసి ఊరుకుంటే? * భావకవిత్వం తెలుగుసాహిత్యానికి చేసిన మేలేమిటి? దాన్ని అర్ధం చేసుకోవడంలో జరిగిన పొరపాట్లేమిటి? * ఏ శిల్పంవల్ల వేమన్న పద్యాలు మనల్ని అంతగా ఆకట్టుకుంటున్నాయి? * కథల్లో రచయితలు ఉద్దేశించిన అంశాలతో బాటు ఉద్దేశించని సామాజిక అంశాలు ఎలా ఉంటాయి? * 'గులాబీ మేఘాలు' సైన్సు ఫిక్షన్ నవల అనువాదంలో తీసుకున్న స్వేచ్ఛ అనుసరణీయమా? * ఇలాంటి ప్రశ్నలకు కాసిని జవాబుల్ని చూపించే ఈ వెలుతురు ప్రహసనాలమీదా రుబాయీలమీదా అనువాదాలమీదా ... ఇతరత్రాకూడా పడింది. సాహిత్యక్షేత్రంలో ఆసక్తి ఉన్న పాఠకులకు కాస్తతోడు ఈ వెలుతురు.

Browse more Telugu books