వుయ్ ద లివింగ్ / WE THE LIVING

M.V.V. Satyanarayana / ఎం.వి .వి సత్య నారాయణ · Novels

వుయ్ ద లివింగ్ / WE THE LIVING book cover

Price: Rs. 450. 1936లో తన ఈ తొలి కాల్పనిక నవలను అయిన్ రాండ్ వెలువరించారు. సవలలో ముఖ్య పాత్రలు ఎన్నో ఉన్నప్పటికీ మూడే మూడు పాత్రల చుట్టూ ఎక్కువగా సంఘర్షణాత్మక కథ నడుస్తుంది. దాదాపుగా పాత్రలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించినా, అయిన్ రాండ్ కేవలం మూడు పాత్రలను త్రీ డైమన్షనల్'గా చిత్రించడంతో ఈనాటికి ఈ రచన ప్రజల మన్ననలను పొందుతోంది. లక్షలాది కాపీలుగా అమ్ముడుపోతోంది. ఆ మూడు పాత్రలూ - కిరా అర్థవ్నోవా, లియో కొవలెన్ స్క్రీ ఆండ్రే తగనోవ్. 'నా ఆత్మకథ అనిపించేటంత సహజత్వంతో పుణికిపుచ్చుకున్న 'వుయ్ ద లివింగ్' కథావస్తువు. కాల్పనిక రచనే! అయితే చారిత్రక నేపథ్యం మాత్రం కాల్పనికమైనది కాదు. కిరా జీవితంలో సంభవించిన సంఘటనలు నా జీవితంలోనివి ఎంతమాత్రం కావు, అలాగే ఆమె ఆలోచనాధోరణి కూడా నాది కాదు. నేరపూరితమైన బలహీనత, ఆమె ప్రదర్శించిన విలువలు కూడానూ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే వ్యక్తిగత పోరాటాన్ని కథావస్తువుగా ఎంచుకున్నారు అయిన్ రాండ్, ఆ మూడు పాత్రలూ తాము జీవించే హక్కు గురించే ప్రభుత్వంతో ఘర్షణధోరణిని అవలంబించడం విశేషం! కిరా ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని, లియోతో ఆమె కలిసి జీవిస్తోంది. వీరిద్దరి జీవితాల మధ్య అప్పటికే సంఘర్షణత్మాక సంఘటనలు జరుగుతున్నప్పటికీ వారి మధ్యకు ఆండ్రే తగనోవ్ ప్రవేశిస్తాడు. వారికి ఉపయోగపడతాడు. అయితే అతడి జీవితం విషాదాంతం! రష్యన్ విప్లవానంతర పరిస్థితులు మానవీయ ధోరణిలో లేవు. భయంకరమైన లంచగొండితనంతో ప్రజల సామాజిక జీవనం అతి దుర్భరమైన పరిస్థితులకు గురవుతోంది. ఈ నవలకు నేపథ్యం అదే. నవలారచన ఉత్కంఠపూరితంగా సాగడానికి అయిన్ రాండ్ ఎంచుకున్న ప్రక్రియ సూటిదనంతోనూ, నిర్మొహమాటత్వం ప్రదర్శించడంతోనూ కలగలిసి ఉంటుంది. ఈ రెండు గుణాలూ పడుగూ పేకల మాదిరిగా అల్లుకుపోయాయి. నవల ప్రతి పుటలోనూ అటువంటి జిగిబిగిని పాఠకులు అనుభవిస్తూ ఉంటారు. అందువల్లనే తెలుగు పాఠకులకు ఈ ఉత్కృష్ట రచనను తేటతెలుగులోనికి అనువదింపజేసి సగౌరవంగా అందించడం జరిగింది. మూల రచనలో ఉన్న సాహితీ పరిమళం చెక్కుచెదరకుండా పాఠకులకు చేర్చుతున్నాము. 'వుయ్ ద లివ

Browse more Telugu books