విశాలాంధ్రలో ప్రజారాజ్యం / Visalandhralo Prajarajyam

పి.సుందరయ్య / P. Sundarayya. · Politics

విశాలాంధ్రలో ప్రజారాజ్యం / Visalandhralo Prajarajyam book cover

Price: Rs. 135. “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” అన్న భావానికి ఆచరణలో సమగ్రత నేటికీ ఏర్పడకపోయినా ఆ విశాలాంధ్ర భావమే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు నాందీ వాచకం పలికిందన్నది నిస్సందేహం. 1946 ఎన్నికల్లోనే గాక, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నూతన రాజ్యాంగ చట్టం ఏర్పడిన వెంటనే 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర నిర్మాణానికి తన మేనిఫెస్టోలో పిలుపు ఇచ్చింది. ఇంకే రాజకీయ పార్టీ అటువంటి నినాదాన్ని ఏ ఎన్నికల్లోనూ ప్రజల ముందుంచిన పాపాన పోలేదు. అంతకు ముందుగాని, తర్వాత గాని అందుకు ప్రత్యేకంగా పోరాడినదీ లేదు. ఈ మహాప్రస్థానానికి నాంది పలికిన తొలి రచనగావడమే “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” ఘనత. అందుకే ఆ దూరదృష్టిని, వెలుగుబాటను వెదజల్లిన సుందరయ్యగారు ధన్యజీవి, చిరస్మరణీయుడు.

Browse more Telugu books