విద్యార్థుల విజయానికి మార్గదర్శకాలు / Guidelines for Student Success
Justice B. Chandrakumar / జస్టిస్ బి. చంద్రకుమార్ · Education & Science

Price: Rs. 135. గౌరవనీయులు న్యాయమూర్తి శ్రీ బి. చంద్రకుమార్ 'విద్యార్థులకు మార్గదర్శకాలు' అనే వ్యాస సంపుటిని ఒక ఉన్నత లక్ష్యంతో రచించారు. ప్రతి విద్యార్థి, విద్యార్థినిలు తమ లక్ష్యం కోసం కృషి చేయాలని "శ్రమైక జీవన సౌందర్యానికి" సమానమైనది లేనేలేదని, ప్రణాళికా బద్ధంగా కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని అనేక అనుభవాల ద్వారా, ప్రశ్నల, జవాబుల ద్వారా తెలిపారు. చరిత్రను సృష్టిద్దాం. విజయఢంకాను మోగిద్దాం. సమాజంలో గొప్పవారుగా గుర్తింపు పొందుదాం అనే గొప్ప లక్ష్యాలు కల్గి ఉండాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కల్పించడానికి ఈ రచన చేశారు. స్టాలిన్ నాన్నగారు చెప్పులు కుట్టేవారు అయినా, స్టాలిన్ జర్మనీ హిట్లర్ ను ఓడించాడని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. సాధించాలనే తపన సంఘంలో గొప్పవాళ్ళము కావాలనే భావన యువతీ, యువకుల్లో ఉండాలనీ ఆయన తపన, భారతరత్న బాబా సాహెబ్ డా॥ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో వివక్షకు గురయ్యారనీ, అయినా చదువు ద్వారానే ఆయన ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డాడని, చదువే ఆయనను గొప్పవాడిని చేసిందనీ, పట్టుదలతో, ధైర్యంతో దారిద్ర్యాన్ని పక్కకు పెట్టి భారతదేశపు న్యాయశాఖా మంత్రిగా ఎదిగాడని, భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత ఆయనకు దక్కిందనీ, ఇటువంటి వ్యక్తులు పేదరికం చదువుకు అడ్డురాదనీ రుజువు చేశారని చెప్పారు.