విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి / Architect of the encyclopedia

కొమర్రాజు లక్ష్మణరావు / Komarraju Lakshmana Rao · Telangana Literature

విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి / Architect of the encyclopedia book cover

Price: Rs. 180. సాహితీలోకంలో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, కొప్పరపు కవులు నుంచి విశ్వనాథ, అడివి బాపిరాజు, రాయప్రోలు దగ్గర నుంచి అభ్యుదయోధ్యమ కవులు, రచయితల్ని సైతం ప్రభావితం చేసిన విజ్ఞాన చంద్రిక లక్ష్మణరావు గారు. ఆయన జీవిత చరిత్రని, సాహితీ కృషిని, సంక్షిప్త పరచి క్రొత్త తరానికి హృద్యంగా చక్కగా అందిస్తున్న ఆచార్య వెలమల సిమ్మన్న గారికి, డా॥ గుమ్మా సాంబశివరావు గారికి, తెలుగు భాషాభిమానులు రుణపడి వుంటారు. ప్రత్యేకంగా నేను వారికి రుణపడ్డాను. వారి కృషికి అభినందనలు. - ప్రొఫెసర్ కొమర్రాజు రవి రచయితగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా శతగ్రంథ రచనకు చేరువలో వున్న ప్రొఫెసర్ వెలమల సిమ్మన్నగారి రచనలపై ఒక ఎమ్.ఫిల్., ఒక పిహెచ్.డి. వచ్చాయి. అలాగే కవి, విమర్శకులు, శతాధిక వ్యాసకర్త, ప్రసంగ ప్రజ్ఞానిధి, దాదాపు నలభై రచనలు చేసిన డా॥ గుమ్మా సాంబశివరావు గారి రచనలపై రెండు పిహెచ్.డి.లు, ఒక ఎం.ఫిల్ వచ్చాయి. వీరి ప్రతిభా పాటవాలు తెలుగు రాష్ట్రాలకు తెలియంది కాదు. ఇప్పటికే వీరు “లక్షణదీపిక", "వ్యాకరణ సంజ్ఞా కోశం", "బాలవ్యాకరణం -శాస్త్రీయ వ్యాఖ్యానం", "శబ్ద బ్రహ్మ చిన్నయసూరి", మొదలైన పుస్తకాల్ని జంటగా రాశారు. అదే కోవలో ఇప్పుడు "విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావు" అనే గ్రంథం వెలువడుతుంది. - ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శన రాజు వర్తమాన తెలుగు సాహిత్య క్షేత్రంలో నిరంతర అక్షర కృషీవలురుగా, పరిశోధకులుగా, బహుగ్రంథకర్తలుగా, మన్నన లందుకున్న ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్ గుమ్మా సాంబశివరావులు తమదైన అధ్యయనం, పరిశీలన, అవగాహనలతో కొమర్రాజుగారి ప్రతిభకు పట్టం కట్టారు. భావి తరాలకు ఒక స్ఫూర్తి కేంద్రంగా ఒక ఆదర్శ నమూనాగా కొమర్రాజు లక్ష్మణరావుగారి జీవితాన్ని అక్షరబద్ధం చేసిన ఈ జంట రచయితల గ్రంథం, ఉత్తమ పరిశోధనా గ్రంథంగా, పాఠకుల సాహిత్య విమర్శకుల ఆదరానికి పాత్రమవుతుందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. - డా॥ దామెర వెంకట సూర్యారావు

Browse more Telugu books