వాల్మీకి రామాయణం / Valmiki Ramayanam
ముసునూరు శివరామ కృష్ణ / Musunuru Sivarama Krishna Rao · Novels

Price: Rs. 315. ఆది కావ్యం రామాయణం. ప్రపంచంలోని ఉత్తమ కావ్యాలలో అగ్రగణ్యం రామాయణం, అంటాడు అరవిందుడు. అనేక పాశ్చాత్య విద్వాంసులూ అదే మాట అన్నారు. వాల్మీకి రామాయణం శైలి, వర్ణనలు, అలంకారాలు, కథాసౌష్టవం, కాళిదాసు వంటి కవులనేకాదు భారతీయ సాహిత్యాన్నంతా ప్రభావితం చేశాయి. ఆసేతుహిమాచలం ఈ నాటికీ రామకథను పదే పదే గానం చేస్తూ పరవశిస్తోంది; రామనామం ముక్తికి సోపానం అని నమ్ముతోంది. రామకథ థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా వంటి పలు దేశాల ప్రజలను ఆకట్టుకొన్నది. రామునికి సాటి దైవం ఇలలో లేడు అంటాడు రామదాసు. నిధికంటే రాముని సన్నిధే సుఖమన్నాడు త్యాగరాజు. శ్రీరాముడే తన చేత భాగవతం పలికించాడన్నాడు పోతన. వాల్మీకి రామాయణం ఇదుగో ఇప్పుడు మీ ముందుంది. తేట తెలుగులో. సుమధుర వచనంలో. రెండు భాగాలలో. ఆస్వాదించండి. అనుభవించండి. పలవరించండి.