వాకపల్లి నేరము - శిక్ష Vakapalli Crime - Punishment
Editor · Caste, Religion & Culture

Price: Rs. 145. వాకపల్లి మహిళల కేసులో బాధితులది గెలుపూ కాదు, ఓటమీ కాదు. వాస్తవానికి న్యాయ ప్రక్రియలో నేరం నిర్ధారణ అయ్యి దోషికి శిక్షపడితేనే బాధితునికి న్యాయం జరిగినట్టు. అయితే వాకపల్లి కేసులో వెలువడ్డ ఈ తీర్పును చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే న్యాయపరంగా మహిళలు బాధితులుగా గుర్తించబడ్డారు. పోలీసులు కూడా దోషులుగా పరిగణించబడ్డారు. దర్యాప్తు సరిగ్గా చేయకపోవడం వల్లనే నేరం నిర్ధారణ కాలేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అంటే మహిళల అభియోగాన్ని కోర్టు పూర్తిగా నమ్మింది. అందుకే వారికి నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది. ఇది కచ్చితంగా వాకపల్లి మహిళల నైతిక విజయమే. కోర్టులో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వారు ఎదిరించి నిలబడిన రోజే విజయం సాధించారని ఆదివాసీ ఐక్య పోరాట సమితి, హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. -రామారావు దొర When it comes to sexual assault, questions to do with power, social patriarchal norms and routine misogyny are pushed to the fringes and instead details to do with time, place, deportment, dress, body movements are foregrounded. No allowance is made for how a victim of assault might remember or reprocess what had occurred, or for the fact that the incident might prove consequential in culturally specific ways. Truth is thus closely linked to evidentiary justice and not much else, and this leads to a devaluing of the larger social and cultural framework within which we make sense of our experiences. - V. Geetha