వలస రాయలసీమలో మహిళా చైతన్యం / Valasa Rayalaseemalo Mahila Chaitanyam
డా. షేక్ మహబూబ్ బాషా / Dr. Shaik Mahaboob Basha · History

Price: Rs. 95. ఈ పుస్తకం కొత్త చూపులో, కొత్త ఎరుకలో భాగం. ఇది తెలుగు సీమలో మహిళా చైతన్య విస్తరణలో అగ్రభాగాన ఉండికూడ విస్మరణకు గురైన, ప్రధాన స్రవంతి చరిత్రకు ఎక్కని రాయలసీమ మహిళా చైతన్య చరిత్రనూ, అందులోనూ ప్రధానంగా మహిళా సంఘాల వ్యాప్తి చరిత్రనూ, కొందరు వ్యక్తుల కృషినీ పరిశీలకుల దృష్టికి తెస్తున్నది. ... సంతృప్తికరమైన, సామాజికంగా ఉపయోగకరమైన చరిత్ర పరిశోధన ఇది. తమ ప్రాంతపు సొంత అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న రాయలసీమ ఉద్యమ కారులకూ, తెలుగు నాట మహిళా చైతన్య చరిత్ర అధ్యయనం చేయదలచిన మహిళా ఉద్యమకారులకూ, తెలుగుజాతి సాంఘిక చరిత్రలో విస్మృత అధ్యాయాలను పరిశోధించదలచుకున్న చరిత్ర పరిశోధకులకూ, సాధారణ పాఠకులకూ కూడ ఆసక్తిదాయకమైన, ఆలోచనాస్ఫోరకమైన, చైతన్యదాయకమైన పుస్తకం ఇది. పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.